Thursday, May 9, 2024
- Advertisement -

మహేష్ కొత్త సినిమా స్టోరీ లీక్ అయ్యింది!

- Advertisement -

మహేష్ – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి స్టోరీ ఇదే అంటూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

లీకైన లైన్ ప్రకారం నిన్ను నువ్వు బాగా ఇష్టపడు, అప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను మరింతగా ఇష్ట పడతారు అన్న కాన్సెప్ట్ తో మహేష్ – కొరటాల శివ ల చిత్రం రూపొందనుందట. దర్శకులు కొరటాల శివ నేను సందేశం ఇవ్వను ,ఎవరైనా ఇస్తే తీసుకొను అని అంటాడు కానీ అతడు చేస్తున్న చిత్రాలు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉన్నాయి. కొరటాల ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు.

ఈ మూడు సినిమాలు కూడా ఎదో ఒక సందేశాన్ని ఇచ్చినవే. ఇప్పుడు మహేష్ సినిమాతో చేయబోతున్న సినిమా  కూడా ఓ మంచి సందేశాన్ని ఇచ్చేదే అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని మహేష్ – కొరటాల శివ లు సంయుక్తంగా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related

  1. మహేష్ ని ఆకాశానికెత్తేసిన మురుగదాస్!
  2. మెగాస్టార్ ను ఆకాశానికెత్తేసిన మహేష్ బాబు!
  3. పచ్చబొట్టు పొడిపించుకున్న మహేష్ భార్య
  4. పీవీపీ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -