Sunday, April 28, 2024
- Advertisement -

ఈగల్‌తో రవితేజ కుమ్మేస్తారా?

- Advertisement -

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఈగల్. టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ తర్వాత రవితేజ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా చేస్తుండగా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక రెండు రోజుల క్రితం విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు, నక్సలైట్లకు కూడా మోస్ట్ వాంటెడ్ అయిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నేపథ్యంలో ట్రైలర్‌ని కట్ చేశారు.

ఇక ముఖ్యంగా డైలాగ్స్‌ అదుర్స్‌. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు… ఆయుధంతో విధ్వంసం ఆపే వాడు దేవుడు… ఈ దేవుడు మంచోడు కాదు… మొండోడు అంటూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించారు రవితేజ. ఈ రెండు పాత్రలకు చక్కటి వేరియేషన్ చూపించారు. గతంలో చూడని రవితేజను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -