Monday, April 29, 2024
- Advertisement -

ఇంటి పేరు మార్చేసిన లావణ్య..!

- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్- అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటీవలె హనీమూన్ ట్రిప్‌ని పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి రాగా తమ సినిమాల్లో బిజీ అయిపోయారు.

ఇక లేటెస్ట్‌గా లావణ్య తన ఇంటి పేరు మార్చుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటివరకు లావణ్య త్రిపాఠి అని ఉండగా దానిని లావణ్య త్రిపాఠి కొణిదెల అని అప్‌డేట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కొణిదెల హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో దీనిని వైరల్‌ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే పేరు మార్చగా ఎక్స్‌లో మాత్రం లావణ్య అనే ఉంది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆపరేషన్‌ వాలంటైన్, మట్కా చిత్రాల్లో నటిస్తున్నారు. ఆపరేషన్ వాలంటైన్ 2024 ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇక మట్కా యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతుండగా వరుణ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -