Saturday, May 18, 2024
- Advertisement -

‘సైరా’ కోసం న‌య‌న‌తారకు భారీగా ఇచ్చుకున్నారుగా..

- Advertisement -

భారీ ప్రాజెక్టు.. క్రేజీ.. పైగా ఆ హీరోతో న‌టించాలంటే త‌నలాంటి వ‌య‌సు హీరోయిన్లు ఎవ‌రూ లేక‌పోవ‌డం.. పైగా ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొంది ఉండ‌డంతో ఓ హీరోయిన్ ఒక సినిమా కోసం ఏకంగా రూ. 3 కోట్లు అడిగిందంట‌. ఒక సీనియ‌ర్ హీరో ప‌క్క‌న న‌టించ‌డానికి ఇంత‌మొత్తంలో డిమాండ్ చేయ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది.

ఖైదీ నంబర్ 150తో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ చేసిన మెగాస్టార్ చిరంజీవి త‌న త‌ర్వాతి సినిమా సైరా కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. ఆ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ ప్రారంభ‌మ‌య్యింది. అయితే ఈ సినిమాలో చిరు ప‌క్క‌న న‌య‌న‌తార‌ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు ఆమె ఈ సినిమా కోసం భారీగా డిమాండ్ చేశారంట‌.

మెగాస్టార్ రాబోతున్న సినిమా సైరాలో నటిస్తున్న నయనతార‌ ఈ సినిమాకు రూ.మూడు కోట్లు తీసుకున్నార‌ని స‌మాచారం. పైగా చిరు ప‌క్క‌న న‌టించ‌డానికి సరిపోయేవాళ్లు కరువైపోయారు. ఈ సమయంలో చిరుతో దొరికిన వాళ్ళకే కోట్లకు కోట్లు పోసి సినిమా చేయించుకోవాల్సిన పరిస్థితి డైరెక్టర్లలో కనిపిస్తోంది. అందుకే నయన్‌కు రూ.మూడు కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారంట.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -