Friday, May 17, 2024
- Advertisement -

బిగ్‌బాస్ న‌టికి లీగల్ నోటీసులు

- Advertisement -

బిగ్‌బాస్‌లో న‌టికి లీగల్ నోటీసులు పంపించారు పోలీసులు.అయితే ఇది తెలుగు బిగ్‌బాస్ న‌టి కాదులేండి.బిగ్ బాస్ 11 కంటెస్టెంట్ హీనాఖాన్ పై ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. హౌస్ లో మంచి పేరు తెచ్చుకున్న హీనాఖాన్ కు బంగారు ఆభరణాలకు సంబంధించిన కేసులో లీగల్ నోటీసులు అందినట్లు తెలుస్తోంది.ఓ బంగారు కంపెనీ ప్రకటనలో నటించిన హీనా ఖాన్, షూటింగ్ అనంతరం నగలను తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకుందట.

దీనికి గాను ఆ కంపెనీ ఆమెకు లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన హీనా ఖాన్ ఇందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. లీగల్ నోటీసులు తన ఇంటి కంటే ముందుగానే మీడియా హౌస్ కు ఎలా వెళ్లాయనే విషయం తనకు అర్ధం కాలేదంటూ ట్వీట్ చేసింది.తనకు ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని చెప్పారు. దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -