Friday, May 3, 2024
- Advertisement -

బిజెపి మిత్రపక్షం ఎవరో తెలిసిపోయిందిగా?

- Advertisement -

ప్రత్యేక హోదా గురించి నరేంద్రమోడీ ఎన్నిసార్లు మాట్లాడాడు అంటే బాబు అండ్ బ్యాచ్ ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేరు. కానీ చంద్రబాబు….ఆయన అనుంగు మిత్రుడు వెంకయ్య, బాబు భజన మీడియా సంస్థలు, పవన్ కళ్యాణ్ మాత్రం మోడీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాడని ఘంటాపథంగా చెప్పారు. సీమాంధ్రులను నమ్మించారు. మోడీకి ఓట్లు వేసేలా చేశారు. ఆ తర్వాత బాబుకు ముఖ్యమంత్రి, వెంకయ్యకు కేంద్రమంత్రి, ఇప్పుడు ఉప రాష్ట్రపతి పదవులు దక్కాయి….పవన్‌కి తెరవెనుక ప్రయోజనాలు అందాయి అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆ రకంగా నాలుగేళ్ళు అసలే దిగులుపడిపోయి ఉన్న సీమాంధ్రుల జీవితాలను ఇంకాస్త అథఃపాతాళానికి నెట్టేసి అధికారాన్ని ఎంజాయ్ చేశారు.

ఇక ఎన్నికల ఏడాదిలో మరోసారి కలిసి ప్రజల ముందుకు వెళ్తే డిపాజిట్లు కూడా దొరకవని అర్థమై అందరూ కూడా విడిపోయినట్టుగా నాటకాలాడి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. అందుకు ప్రబల సాక్ష్యాలుగా తాజా పరిణామాలు నిలుస్తున్నాయి. ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేలపై టిడిపి స్పీకర్ వేటు వేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రాజకీయ విలువల గురించి మాట్లాడుకొనేస్థాయిలో స్పీకర్ వ్యవస్థను నిర్వహించడం లేదు అన్న నిజం ఒప్పుకుని తీరాలి. కానీ కేంద్రంలో బిజెపి పార్టీ నుంచి స్పీకర్ ఉన్నప్పటికీ టిడిపిలోకి ఫిరాయించిన ఎంపిలపై ఎందుకు వేటు వేయడం లేదు? పైగా వైకాపా లీడర్‌గా ఫిరాయించిన ఎంపి పేరును అధికారికంగా నమోదు చేయడం ఏంటి? ఆపరేషన్ గరుడవేగలో టిడిపిని, చంద్రబాబును సర్వనాశనం చేయాలన్నంత శతృత్వం మోడికి ఉంది అని చంద్రబాబు చెప్తున్నది నిజమే అయితే మోడీ ఇలా చేస్తాడా? చేతికందిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఫిరాయించిన ఎంపిలపై వేటు వేసి బాబుపై రివేంజ్ తీర్చుకోడా? ఇక అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా మెజార్టీ ఎంపిలున్న కాంగ్రెస్ తీర్మానం కాదని టిడిపికి ఉపయోగపడేలా టిడిపి తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని టిడిపికి రాజకీయ ప్రయోజనం కలిగేలా చేయడం వెనుక ఉద్ధేశ్యం ఏంటి?

ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న వాళ్ళకు ఎవ్వరికైనా బిజెపి, టిడిపిల చీకటి బంధం సులభంగానే అర్థమవుతుంది. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే ఓట్లు పడతాయనుకున్నారు కాబట్టి కలిసి పోటీచేశారు. ఈసారి కలిసి పోటీ చేస్తే డిపాజిట్స్ కూడా రావు కాబట్టి శతృవులమైపోయాం అన్న బిల్డప్పు డ్రామాలు ప్లే చేస్తూ ప్రజల ముందు షో చేస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్, చంద్రబాబు కచ్చితంగా కలుస్తారనడంలో సందేహమే లేదు. అలాగే మోడీ అధికారంలోకి రావడానికి సాయం అందించడానికి చంద్రబాబు కూడా సదా సిద్ధంగా ఉంటాడన్నది నిజం. మోడీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని చంద్రబాబుని చెప్పమనండి. అఫ్కోర్స్ చంద్రబాబు అలా మాట చెప్పినా నమ్మేవారు ఎవ్వరూ లేరనుకోండి. రుణమాఫీ హామీలతోనే బాబు మాటలపై అంతకుముందు ఉన్న కాస్త నమ్మకం కూడా ప్రజలకు పోయింది. ఇక పవన్ కూడా ఆ తానులో ముక్కే అన్నది నిజం. వీళ్ళందరికంటే కంటికి కనిపిస్తున్న రాజకీయాలను పరిశీలిస్తే మాత్రం జగన్ తీసుకున్న స్టాండే కాస్త బెటర్‌గా ఉంది. 2014 ఎన్నికలకు ముందు, ఇప్పుడు 2019 ఎన్నికలకు కూడా జగన్‌ది ఒకటే మాట. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వాళ్ళకే మా మద్దతు అని జగన్ స్పష్టంగా చెప్తున్నాడు. 2019లో కూడా పచ్చ బ్యాచ్ డ్రామాలకు మరోసారి సీమాంధ్రులు పట్టం కడతారా? నాలుగేళ్ళపాటు హోదా కోసం ఉధ్యమించిన అందరినీ ఎటకారం చేసిన చంద్రబాబు ఇప్పుడు చూపిస్తున్న డ్రామాలకు మరోసారి ఓట్లు పడతాయా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -