“ఫలక్ నామా దాస్” మూవీతో మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు విశ్వక్ సేన్. తాజాగా ఆయన హీరోగా రుహాని శర్మ హీరోయిన్ గా శైలేష్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్”. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ : విక్రమ్ రుద్రరాజు(విశ్వక్ సేన్) ప్యానిక్ అటాక్ డిజార్డర్ తో బాధపడే ఓ క్రైమ్ ఆఫీసర్. అయితే విక్రమ్ ప్రేమించిన అమ్మాయి రుహాని శర్మ మిస్సయిపోతుంది. అలానే ఇంకో పక్క ప్రీతీ అనే అమ్మాయి కూడా మిస్సవుతుంది. ఈ రెండు కేసుల వెనక ఉన్నది ఎవరు ? విక్రమ్ ఈ రెండు కేసుల గురించి తెలుసుకున్న నిజాలు ఏంటి ? విక్రమ్ ఈ కేసులను ఎలా ఛేదించాడు ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ : విశ్వక్ ఈ చిత్రం ద్వారా తన నటనలోని ఈజ్ ను మరోసారి చూపించాడు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో కానీ కొన్ని అగ్రెసివ్ సీన్స్ లో కానీ విశ్వక్ పెర్ఫామెన్స్ చాలా బాగుంది. ఇక హీరోయిన్ రుహాని శర్మ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఓ రెంజ్ లో ఉంది. ఎడ్డింగ్ లో వచ్చే ఆసక్తికరమైన సీన్స్ థ్రిల్లింగ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను మరింత థ్రిల్ చేస్తాయి. ఇక సినిమాకో మరో ప్రధాన ప్లస్ పాయింట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే సీన్స్ కి వివేక్ సాగర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అలానే సెకండాఫ్ కూడా ఎక్కడ డల్ కాకుండా ఉంది. విశ్వక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తన లైఫ్ లో ఏమయ్యింది అన్న విషయాన్ని షార్ట్ అండ్ స్వీట్ గా చూపించి ఏమాత్రం బోర్ అనిపించకుండా దర్శకుడు తెరకెక్కించాడు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ముఖ్యపాత్రలో నటించిన మురళీ శర్మ,బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక డైరెక్టర్ ఈ సినిమాపై పెట్టిన ఎఫర్ట్స్ కళ్లకు కనిపిస్తాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో మంచి రో కనబర్చారు. అలాగే మణికందకన్ అందించిన సినెమాటోగ్రఫి చాలా నాచురల్ గా ఉంది. వివేక్ సాగర్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రాణం అని చెప్పాలి.
మైనస్ పాయింట్స్ : సినిమా ఎక్కువ సీరియస్ గా సాగుతోంది. కమర్షియల్ హంగులు పెద్దగా ఉండవు.
మొత్తంగా : హిట్ పేరు తో వచ్చిన ఈ సినిమా విశ్వక్ మరియు శైలేష్ కు హిట్ ఇచ్చిందనే చెప్పాలి. ఆసక్తికరంగా సాగే స్క్రీన్ ప్లే, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. అలానే పెద్దగా కమర్షియాలిటీ లేకపోవడం కాస్త మైనస్ అయినప్పటికి సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈ సినిమాని తీశారు. థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా పండగే.
