Friday, April 19, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ యాక్షన్ కు హాలీవుడ్ డైరెక్టర్

- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులు మెగాప‌వ‌ర్ స్టార్ ర‌మ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా న‌టిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కెతున్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్ష‌కులే కాకుండా యావ‌త్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ సినిమా షూటింగ్‌ను త్వ‌ర‌లోనే పూర్తి కానుంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్, యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. అయితే, సినిమా మేకింగ్‌లో ఎంత‌గానో శ్ర‌మించే రాజ‌మౌళి.. ఈ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయిలో అన్ని ప్ర‌మాణాల‌కు అనుగుణంగా తెర‌కెక్కిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ సినిమా యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం ఏకంగా హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌ను రంగంలోకి దింపాడు.

హాలీవుడ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌డంలో హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్ నిక్ పావెల్ పెట్టింది పేరు. ఆయ‌న ఒక గొప్ప క‌త్తి యుద్ధాల నిపుణుడు. తాజాగా యుద్ధ స‌న్నివేశాల‌కు సంబంధించి నిక్‌పావెల్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సెట్‌లో రాజ‌మౌళికి సూచ‌న‌లు ఇస్తున్న వీడియోను చిత్ర యూనిట్ అభిమానుల‌తో పంచుకుంది. దీంతో యాక్ష‌న్ స‌న్నివేశాల‌పై మరింతగా అంచ‌నాలు పెరుగుతున్నాయి.

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -