బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

- Advertisement -

హాట్ బ్యూటీ రాశీఖ‌న్నా ఇటు తెలుగు అటు త‌మిళ్ సినిమాల‌తో పాటు బాలీవుడ్‌లోనూ బిజీబిజీగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. త‌న హాట్ హాట్ అందాల‌లో సోష‌ల్ మీడియాలోనే కాకుండా వెండితెర‌పై మెరిసిన ఈ అమ్మ‌డు తాజాగా బాక్సింగ్ రింగులోకి దూకింది. ఏకంగా పంచు ప‌డుద్ది అంటూ వార్నింగ్ ఇస్తోంది. దీంతో నెటిజ‌న్లు అయ్య బాబోయ్ అంటున్నారు. ఎందుకు? ఎక్క‌డ‌? అనే క‌దా మీ ప్ర‌శ్న‌..!

ఆ క‌థేంటో ఇప్పుడు తెలుసుకుందాం ! తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా సోష‌ల్ మీడియాలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ప‌లు ఫోటోల‌ను షేర్ చేసింది. స‌ర‌దాగా ఫొటో ఫోజుల కోసం దిగింద‌ని అంద‌రూ అనుకున్నారు కానీ ఈ భామ నిజంగానే కిక్ బాక్సింగ్ నేర్చుకుంటుంద‌ట‌. ఇదంతా కూడా తాను ప్ర‌స్తుతం న‌టిస్తున్న ఓ వెబ్ సిరీస్ కోస‌మ‌ని తెలిసింది.

- Advertisement -

ప్ర‌స్తుతం రాశీఖ‌న్నా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో క‌థ‌నాయ‌కుడిగా బాలీవుడ్ న‌టుడు షాహీద్ క‌పూర్ న‌టిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ కోస‌మే తాను బాక్సింగ్ రింగ్‌లోకి దిగాన‌నీ, అందుకే బాక్సింగ్ నేర్చుకుంటున్నాన‌ని రాశీ ఖ‌న్నా తాజాగా వెల్ల‌డించింది. ఓ వెబ్ సిరీస్ ద్వారా చాలా కాలం త‌ర్వాత బాలీవుడ్‌లోకి మ‌ళ్లీ అడుగుపెడుతున్నాన‌ని తెలిపింది. దీనిలోని పాత్ర కోస‌మే తాను బాక్సింగ్ నెర్చుకుంటున్నాన‌ని తెలిపింది ఈ అమ్మ‌డు.

షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !

‘అన్నాతే’ షూటింగ్ లో సూప‌ర్ స్టార్ ర‌జినీ

సోష‌ల్ మీడియాపై కేంద్రం చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించిన విజ‌య‌శాంతి

మ‌హా శివరాత్రికి పవన్ సినిమా ఫస్ట్ లుక్!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -