పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

- Advertisement -

ఆంధ్ర ప్ర‌దేశ్ స్థానిక పంచాయ‌తీ ఎన్నిక‌ల ముగిసిన త‌ర్వాత జ‌న‌సేన‌, అధికార వైకాపా నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైకాపా నేత‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆయ‌న భీమ‌వ‌రం వైకాపా ఎమ్మెల్యే గంధ్రి శ్రీ‌నివాస్‌పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమార‌మే రేపాయి.

భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఓ ఆకు రౌడీ అని అంటూ ప‌న‌వ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. అలాగే, ప‌లు బ్యాంకులను మోసం చేసిన చరిత్ర ఆయనకుంద‌ని ప‌వ‌న్ ఆరోపించారు. ఆయ‌న‌కు పిచ్చిప‌ట్టింద‌నీ, పిచ్చికుక్కల వ్యాన్ లో వేసి తీసుకెళ్లాలని విమ‌ర్శించారు. కాగా, ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై తాజాగా గ్రంధి శ్రీ‌నివాస్ అదే స్థాయిలో జ‌న‌సేన అధినేత‌కు కౌంట‌ర్ ఇచ్చారు.

- Advertisement -

జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ అంటూ గ్రంధి శ్రీ‌నివాస్ ఆరోపించారు. ప‌వ‌న్ ఒక మాన‌సిక రోగి అంటూ విమ‌ర్శించారు. అవ‌గాహ‌న లోపంతోనే ప‌వ‌న్ రాజ‌కీయ పార్టీపెట్టార‌ని అన్నారు. ప్ర‌స్తుతం పూర్తిగా అజ్ఞానంతో నిండిపోయి ప‌వ‌న్ మాట్లాడుతున్నార‌నీ, త‌న‌ను పిచ్చి కుక్కల వ్యాన్ లో వేసి పంపుతామ‌ని అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో రెండు చోట్ల ప్ర‌జ‌లు ప‌వ‌న్‌ను అదే వ్యాన్‌లో పంచించార‌ని పేర్కొన్నారు. దీనిపై ప‌వ‌న్ ఏ స్థాయిలో స్పందిస్తారో చూడాలి మ‌రి.

షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !

‘అన్నాతే’ షూటింగ్ లో సూప‌ర్ స్టార్ ర‌జినీ

సోష‌ల్ మీడియాపై కేంద్రం చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించిన విజ‌య‌శాంతి

మ‌హా శివరాత్రికి పవన్ సినిమా ఫస్ట్ లుక్!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -