‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

- Advertisement -

న్యూస్ రీడ‌ర్‌గా కెరియ‌ర్ ప్రారంభించి యాంక‌ర్‌గా, యాక్ట‌ర్‌గా బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది అన‌సూయ‌. ఓ ప్ర‌ముఖ ఛానెల్ లో ప్రసార‌మైన జ‌బ‌ర్ధస్త్ ఖ‌త‌ర్నాక్ కామెడీ షోలో త‌న అందం, అభినయంతో మ‌స్తు క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డికి సినిమా అవ‌కాశ‌లు సైతం వ‌చ్చాయి. దీంతో ఇటు బుల్లితెర అటు వెండితెర‌పై త‌న హ‌వా కొన‌సాగిస్తోంది.

తాజాగా అన‌సూయ ‘పైన ప‌టారం.. లోన లోటారం’ అంటోంది. ఎక్క‌డ? ఎందుకు అనుకుంటున్నారా? అదేనండి ఆమె న‌టిస్తున్న కొత్త సినిమాలో.. ! ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ అనే సినిమాలో ఈ హాట్ బ్యూటీ అన‌సూయ ఓ ప‌త్యేక గీతం (ఐటెం సాంగ్‌) చేస్తోంది. దీనిని సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ ఐటెం సాంగ్ ప్రొమోను విడుద‌ల చేసింది. ఇందులో ఈ అమ్మ‌డు త‌న అందాల‌తో అద‌ర‌గొడుతూ.. ప‌క్కా మాస్ త‌ర‌హాలో ఉంది. దీంతో పూర్తి పాట కోసం ఎదురుచూస్తున్నామ‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

కాగా, చ‌వు క‌బురు చ‌ల్ల‌గా సినిమాతో కౌశిక్ పెగళ్లపాటి నూత‌న ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఇందులో కార్తికేయ, లావణ్య త్రిపాఠిలు హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బ‌న్నీ వాసు నిర్మాత‌గా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై ఈ సినిమా రాబోతుంది. జేక్స్ బెజోయ్ చావు క‌బురు చల్ల‌గా సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అన‌సూయ పైన ప‌టారం లోన లోటారం ప్రోమో సాంగ్‌పై మీరు ఓ లుక్కెయండి మ‌రి.. !

షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !

‘అన్నాతే’ షూటింగ్ లో సూప‌ర్ స్టార్ ర‌జినీ

సోష‌ల్ మీడియాపై కేంద్రం చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించిన విజ‌య‌శాంతి

మ‌హా శివరాత్రికి పవన్ సినిమా ఫస్ట్ లుక్!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -