Sunday, May 19, 2024
- Advertisement -

శ్రీమంతుడు బాలకృష్ణను కాపీ కొట్టాడా..!

- Advertisement -

శ్రీమంతుడు బాలకృష్ణను కాపీ కొట్టాడా..! ఇది నిజమో కాదో తెలీదు కానీ ప్రస్తుతానికి ఫిల్మ్‌నగర్‌ లో ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే బాలకృష్ణ మూవీ జననీ జన్మభూమి సినిమా కథను మహేశ్‌బాబు శ్రీమంతుడు కాపీ కొట్టాడని ప్రచారం జరుగుతోంది.

జననీ జన్మభూమి సినిమాకు శ్రీమంతుడు సినిమాకు ఎన్నో పోలికలు ఉన్నాయని ఫిల్మ్‌ నగర్‌‍లో టాక్.  బాలకృష్ణ మూవీ జననీ జన్మభూమిలో హీరో బాధ్యతారహితంగా తిరుగుతుంటే, హీరోయిన్ నాలుగు మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపిస్తుంది.

హీరో బాలకృష్ణతో మంచి పనులు చేయిస్తుంది. అలానే మహేశ్‌బాబు కూడా శ్రీమంతుడు మూవీలో ధనవంతుడి కొడుకుగా ఉండి, బాధ్యతారహితంగా తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే స్వభావంతో ఉంటాడు. అలాంటి హీరోను హీరోయిన్‌గా శృతిహాసన్ మార్చి, ఊరి కోసం ఏదైనా చేయాలనే భావనకు వచ్చేలా ప్రేరణ చేస్తుంది.

ఈ రెండు సినిమా కథలు ఒకటే విదంగా ఉన్నా శ్రీమంతుడు స్క్రీన్‌ప్లే అదిరిపోయేలా దర్శకుడు కొరటాల శివ చేశాడని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -