Wednesday, May 15, 2024
- Advertisement -

రజనీకాంత్ నెక్ట్స్ ఇదే.. ఈ నెల 21 నుంచి షూటింగ్ స్టార్ట్!

- Advertisement -

‘లింగా’ సినిమా విడుదలై ఇప్పటికే చాలా రోజులయిపోయాయి. ఆ తర్వాత ఇప్పటి వరకూ రజనీకాంత్ తదుపరి సినిమా ఏదో క్లారిటీ లేదు. అనేక సినిమాలు ప్రతిపాదనలోకి వచ్చినా.. రజనీ ఏ సినిమాలో చేయబోతున్నాడనే విషయం కన్ఫర్మ్ కాలేదు.

శంకర్ దర్శకత్వంలో రోబో పార్ట్ టూ లో చేయబోతున్నాడని ఒక సారి..అలాకాదు.. పవన్ వడయార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించబోతున్నాడని మరోసారి ప్రచారం జరిగింది. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు.

ఇలాంటి నేపథ్యంలో తాజాగా రజనీకాంత్ సినిమా కన్పర్మ్ అయ్యింది. ఈ నెల 21 వ తేదీ నుంచి ఆసినిమా షూటింగ్ కూడా మొదలు కానుండటంతో ఇది పట్టాలెక్కడం ఖాయమే అనుకోవాల్సి వస్తోంది. ఈ సినిమాకు రంజిత్ అనే తమిళ దర్శకుడు డైరెక్షన్ బాధ్యతల్లో ఉంటాడని తెలుస్తోంది. సినిమాలో రజనీ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడని దీనికి ‘కాళీ’ అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేశారని సమాచారం. ఇందులో ఒక పాత్రలో రాధికా అప్టే కనిపించనుందట.

మరి ‘లింగా’ వంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత ఈ విధంగా రజనీకాంత్ సినిమా ఒకటి షూటింగ్ స్టార్ట్ కాబోతుందనమాట. మరి దీంతో సూపర్ స్టార్ ఏ విధంగా సత్తా చాటతాడో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -