Thursday, May 9, 2024
- Advertisement -

మాజీ భార్య ఫోటో షేర్ చేసిన హృతిక్

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ త‌న మాజీ భార్య ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం సంచ‌లనంగా మారింది.హృతిక్ రోషన్ – సుజానే ఖాన్ జంట తమ పద్నాలుగేళ్ళ వివాహబంధానికి 2014లో ముగింపు పలికిన సంగతి తెలిసిందే.వీరికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.రీసెంట్ గా హృతిక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తమ ఫోటో పోస్ట్ చేసి ఒక ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు. ఆ ఫోటోలో హృతిక్ తనపిల్లలతో బీచ్ లో ఎంజాయ్ చేస్తుండగా సుజానే వారికి ఫోటోలను తీస్తోంది. దీనికి క్యాప్షన్ గా “ఇక్కడ ఉండేది సుజానే.. నా క్లోజెస్ట్ ఫ్రెండ్ మా ఫోటోలు తీస్తోంది.

ఇదో ప్రత్యేక క్షణం. ఇది మా పిల్లకు ఒక కథ చెబుతుంది. అదేంటంటే.. ఎన్నోరకాలుగా విడిపోయిన ప్రపంచంలో కూడా కలిసి ఉండడం సాధ్యమే. మీకు వేరే అభిరుచులు ఉండవచ్చు.. కానీ ఐకమత్యంగా ఉండవచ్చు. ఇది కలిసి ఉండే.. సహనపూర్వకమైన.. ధైర్యంగా ఉండే ప్రేమ ప్రపంచం. ఇదంతా ఇంటివద్దే మొదలవుతుంద‌ని ఓ పోస్ట్ చేశాడు.దీంతో మ‌ళ్లీ ఈ ఇద్దరూ ఒక్కటవుతున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు హల్చల్ చేస్తున్నాయి.మ‌రి దీనిపై హృతిక్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -