హీరో కార్తికేయ అంటే ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు కాని ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరో అంటే మాత్రం అందరికి ఇట్టే గుర్తుకు వస్తాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు కార్తికేయ. ఈ సినిమా తరువాత కార్తికేయ నటిస్తున్న చిత్రం హిప్పి. పలకడానికే సౌండ్ వెరైటీగా ఉంది కదా. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. దిగంగనా ,సుర్యవంశి జజ్బా సింగ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా T.N. కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో కార్తికేయ సిక్స్ ప్యాక్ బాడిలో కనిపించనున్నాడు. ఇక టీజర్ విషయానికి వస్తే మొదటి సీన్ లోనే కార్తికేయ ప్లేబాయ్ నేచర్ గురించి కమెడియన్ వెన్నెల కిషోర్ వివరించేస్తాడు. వీలైనప్పుడల్లా అమ్మాయిలతో లిప్ లాక్ లు లాగించడం అవలీలగా చేసేస్తున్నాడు. టీజర్‌ను మాత్రం లిప్ లాక్‌లు, ఫైట్‌లతో నింపేసిన దర్శకుడు , కథను మాత్రం బయటికి రివిల్ చేయలేదు.
- Advertisement -
లిప్ లాక్‌లను ఈజీగానే లాగించేస్తున్నాడు..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -