Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసిన.. ఆర్ఎక్స్ బామ!

- Advertisement -

ఆర్ఎక్స్ 100 ద్వారా ఎంతోమంది కుర్రకారుల మనసు దోచేసిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 ద్వారా పరిచయమై మంచి విజయాన్ని సాధించింది. అందంతో పాటు ఎంతో టాలెంట్ ఉన్న ఈ భామకు పలు సినిమాలలో అవకాశం వచ్చినప్పటికీ పెద్దగా విజయాలను అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఈమెకు ఎలాంటి అవకాశాలు లేకుండా ఉండిపోయింది.

పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆర్ఎక్స్ బామకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

Also read:వారి వల్ల నాకు అవకాశాలు తగ్గలేదు: నటి అంజలి

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలుగా మారిపోయారు. ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే ఐదవ సీజన్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూమ్ ద్వారా అభ్యర్థుల ఆడిషన్లు జరుగుతున్నాయని, ప్రస్తుతం పోటీదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also read:వామ్మో ..ప్రభాస్ ఆది పురుష్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -