Sunday, April 28, 2024
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో.. ఎవరంటే?

- Advertisement -

టాలీవుడ్ విలక్షణ నటుడు శర్వానంద్ హీరోగా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రస్తుతం శర్వానంద్ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని దూసుకుపోతున్నాడు. తాజాగా శర్వానంద్‌ హీరోగా “ఆర్‌ఎక్స్‌ 100” ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో రొమాంటిక్‌ ల‌వ్ అండ్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న సినిమా “మహాసముద్రం”ఈ మూవీలో మరో హీరోగా సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు.

ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడిన “మహా సముద్రం” సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు19న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. బి.కిశోర్‌ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం “శ్రీకారం”మూవీ బాక్సాపీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

Also read:అడిగిందంతే.. వరలక్ష్మి శరత్ కుమార్ కోసం కదిలిన తారలు..?

తాజాగా హీరో శర్వానంద్ కు స్టార్ డైరెక్టర్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది.అనిల్ రావిపూడి దర్శకత్వంలోను ఆయన ఒక సినిమాను చేయనున్నాడనే టాక్ ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగిపోయినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి. బాలకృష్ణతో కూడా సినిమా చేస్తాడనే టాక్ వినిపించింది. అనిల్ రావిపూడి ఎవరితో ముందు సినిమా చేస్తాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Also read:హోల్ సెల్ గా అభిమానులను బురిడీ కొట్టించిన డాక్టర్ బాబు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -