Sunday, May 5, 2024
- Advertisement -

అర్థ‌రాత్రి తాగి ర‌చ్చ చేసిన న‌టుడు

- Advertisement -

ఈ మ‌ధ్య సెల‌బ్ర‌టీలు త‌ర‌చు ఏదో ఒక వివాదాల‌లో చిక్కుకుంటున్నారు.ఎక్కువుగా మ‌ద్యం సేవించి పోలీసులకు అడ్డంగా బుక్క‌వుతున్నావారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.తాజాగా అలాంటి ఇష్యూలోనే ఇరుకున్నాడు ఓ న‌టుడు.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…..కన్నడ నటుడు హుచ్చ వెంకట్ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఇప్పుడు మరో వివాదంతో వార్తల్లోకెక్కాడు. రాత్రంతా మద్యం ఎక్కువగా తీసుకొని ఉదయం ఆ మత్తు దిగకుండానే దగ్గరలో ఓ బేకరీకి వెళ్లి గొడవ చేశాడట. అతడి చర్యలతో షాక్ తిన్న బేకరీ యజమాని ఆ తరువాత అతడికి ఎదురుతిరిగాడు.

వెంకట్ కి మరింత కోపం వచ్చి సెలబ్రిటీ అయిన నాపైనే ఎదురు తిరుగుతావా అంటూ బేకరీలో ఉన్న వస్తువులను నాశనం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బేకరీ యజమాని పోలీసులకు సమాచారం అందించగా.. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుచ్చ వెంకట్ ని హెచ్చరించి అతడిపై కేసు పెట్టకుండా పంపించినట్లు సమాచారం. ప‌లువ‌రు సెల‌బ్రిటీలు ఇలా మ‌ద్యం సేవించి ప‌డుబ‌డ‌టం ఇదేం మొద‌టిసారి కాదు.గ‌తంలో చాల‌మంది ఇలా త‌ప్ప‌తాగి రోడ్ల మీద ప‌డుతు లేస్తు ర‌చ్చ చేసిన సంద‌ర్భాలు చాల‌నే ఉన్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -