Friday, May 24, 2024
- Advertisement -

‘కాలా’కు అంతేసి కొన్నారు.. మ‌ళ్లీ ‘క‌బాలి’ అవుతుందా?

- Advertisement -

సినిమా విడుద‌ల‌కు ముందే మార్కెట్ భారీగా జ‌రుగుతోంది. సినిమా విడుద‌ల‌కు ముందు ఎంత మార్కెట్ సాధించిందోన‌ని ఇప్పుడు అన్ని ప‌రిశ్ర‌మ‌లు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు అయితే సినిమా పెట్టుబ‌డి మొత్తం ముంద‌స్తు బిజినెస్‌తోనే రాబ‌ట్టుకుంటున్నాయి. ఇప్పుడు ర‌జనీకాంత్ న‌టించిన ‘కాలా’ సినిమాకు భారీ ఎత్తున శాటిలైట్ హ‌క్కుల‌కు భారీ ధ‌ర ప‌లికింది.

పా రంజిత్‌ దర్శకత్వంలో ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా ‘కాలా’. ఈ సినిమా శాటిలైట్‌ హక్కులకు భారీ డిమాండ్ వ‌చ్చింది. హక్కుల కొనుగోలుకు ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ రూ.75 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అన్ని భాషల్లో హక్కులను ఛానెల్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతేసి కొన‌డం సినీ ప‌రిశ్ర‌మ‌ను ఆందోళ‌న‌లో ప‌డేస్తోంది. ఎందుకంటే గ‌తంలో క‌బాలి సినిమాను కూడా భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసి న‌ట్టేటా మునిగారు. మ‌రీ ఇప్పుడు ఈ సినిమా కోసం రూ.75 కోట్లు వెచ్చించ‌డం సినిమా ఫ‌లితంపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఒక‌వేళ సినిమా ఫ్లాప‌యితే మాత్రం దారుణంగా న‌ష్టపోయే అవ‌కాశం ఉంది.వండర్‌బార్ బ్యాన‌ర్‌పై ర‌జ‌నీకాంత్ అల్లుడు, హీరో ధనుశ్‌ ‘కాలా’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -