Tuesday, May 14, 2024
- Advertisement -

ఎమ్మెల్సీ ప‌ద‌వికి సోము వీర్రాజు రాజీనామా ..?

- Advertisement -

ఏపీ లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యన తెగదెంపుల పర్వం నడుస్తోంది. యూనియన్ బడ్జెట్ అనంతరం… కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ నేతలు సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజులు తప్పుకోవడం ఆ వెంటనే ఏపీ కేబినెట్ లోని బీజేపీ నేతలు రాజీనామాలు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్టుగా ప్రకటించింది.

ఇక భాజాపా కూడా బంధం తెంచుకోవ‌డానికి పూనుకుంది. దానిలో భాగంగా తన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయబోతున్న‌ట్లు ప్ర‌క‌టించార సోము వీర్రాజు. టిడిపి మిత్రపక్షంగా ఉన్నపుడు తనకు వచ్చిన ఎంఎల్సీ పదవిని వ‌దులుకొనేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇతర నామినేటెడ్ పదవులను కూడా తమ నేతలు రాజీనామాలు చేస్తారని చెప్పారు. నిజానికి పదవుల కోసం బిజెపి నేతలు చాలా కాలంగా ఒత్తిడి తెస్తున్నా చంద్రబాబునాయుడు వారికి పెద్దగా పదవులు ఇచ్చింది లేదు. అన్నీ ప్రతిపాదనలు పెండింగ్ లోనే ఉంచారు. మిత్రపక్షాలుగా ఉన్న టిడిపి-బిజెపి విడిపోవటంతోనే అందుకున్న అరోకొరా పదవులకు కూడా రాజీనామాలు చేస్తున్నారు. ఏపిఎన్ఎంఐడిసి ఛైర్మన్ పదవికి కూడా లక్ష్మీపతి రాజీనామా అందులో భాగమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -