Friday, May 3, 2024
- Advertisement -

హరిహరవీరమల్లు కోసం ఆగ్రా సెట్​..

- Advertisement -

పవన్​ కల్యాణ్​, క్రిష్​ కాంబోలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. మొగలాయిల కాలంనాటి కథ ఆధారంగా ఈ మూవీ వస్తోంది. ఇక ఈ సినిమా పాన్​ ఇండియా మూవీగా అన్ని భాషల్లోనూ విడుదల కాబోతున్నది. బాహుబలి తరహాలో ఈ సినిమా కోసం సెట్స్ వేసి షూటింగ్ జరుపుతున్నారు. మొగలాయిల కాలం నాటి వాతావరణాన్ని తలపించేలా ఈ సెట్స్ వేశారు. ఆ సెట్స్ లోనే ఇప్పటివరకు హరిహర వీరమల్లు షూటింగ్ జరిపారు.ఇప్పటికే చార్మినార్​ సెట్​ వేసి కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.

తాజాగా ఆగ్రా కోట సెట్ వేస్తున్నారు. ఇందులోనే కొన్ని రోజుల పాటు షూటింగ్ జరుపనున్నారు. ఈ చిత్రంలో విజువల్​ ఎఫెక్ట్స్​ కూడా ఓ రేంజ్​లో ఉంటాయని టాక్​.పవన్​ ఇమేజ్​ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ మల్ల యోధులతో తలపడుతున్న దృశ్యాలను చూడవచ్చు. ఇందులో పవన్ గెటప్ కూడా కనిపిస్తుంది.

ఈ సినిమా ఆల్మోస్ట్ సెట్స్ లోనే జరగాల్సి ఉండడంతో చిత్రీకరణ కూడా ఆలస్యంగా జరుగుతోంది. అందువల్లే పవన్ ఈ సినిమాను హోల్డ్ లో పెట్టి ముందుగా మలయాళ రీమేక్ సినిమాను కంప్లీట్ చేయనున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా కోసం ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించనున్నట్లు సమాచారం. క్రిష్ ఇదివరకే చారిత్రక కథలతో గౌతమీపుత్ర శాతకర్ణి, మణికర్ణిక తీసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో హరిహర వీరమల్లు పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read

దగ్గు, జలుబును దూరం చేసే మిరియాల రసం తయారీ విధానం?

‘ఐకాన్’ తో సుకుమార్ కు భలే చిక్కొచ్చి పడిందే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -