Saturday, April 20, 2024
- Advertisement -

దగ్గు, జలుబును దూరం చేసే మిరియాల రసం తయారీ విధానం?

- Advertisement -

వర్షాకాలం మొదలవడంతో ఎంతోమంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విధంగా బాధపడేవారికి మిరియాల రసం ఒక మంచి ఉపశమనంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. మరి ఈ రుచికరమైన ఔషధ గుణాలను కలిగి ఉన్న మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం….

కావలసిన పదార్థాలు:
మిరియాలు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ధనియాలు టేబుల్ స్పూన్, ఎండు మిర్చి 6, కొబ్బరి తురుము 3 టేబుల్ స్పూన్లు చిటికెడు పసుపు, చింతపండు గుప్పెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర తురుము, చిన్న సైజు బెల్లం ముక్క, నూనె తగినంత, పోపు దినుసులు.

తయారీ విధానం:
*ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలి.

*అదేవిధంగా చింతపండును నానబెట్టుకోవాలి. దొరగా వేయించుకున్న మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

*చింతపండు నానిన తర్వాత బాగా పులుసు చేసి మరొక గిన్నెలోకి వేసుకోవాలి. పులుపు సరిపడా నీటిని వేసుకోవాలి.

Also read:వామ్మో… అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన నయన్?

  • ఈ నీటిలోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిరియాల పొడి మిశ్రమాన్ని, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి.

*ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె ఉంచి కొద్దిగా నూనె వేసి పోపు పెట్టుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించాలి.

*పోపు దినుసులు వేడైన తర్వాత ముందుగా తయారు చేసుకున్న మిరియాల రసం అందులో వేసి ఉడికించాలి.

Also read:ఆచార్య నుంచి మరో సర్ప్రైస్.. ఈసారి చెర్రీ వంతు?

*ఐదు నిమిషాల పాటు ఉడికించి తర్వాత ఇందులోకి కొబ్బరి పొడి, కొత్తిమీర తురుము వేసి కలుపుకోవాలి. అవసరమనుకున్న వారు మాత్రమే రుచికోసం బెల్లం ముక్కను వేసుకోవచ్చు.

*ఈ విధంగా తయారు చేసుకున్న మిరియాల రసం వేడి అన్నంలోకి తినటం వల్ల జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు కూడా దూరం అవుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -