Saturday, May 4, 2024
- Advertisement -

వెంకీ స‌ర‌స‌న హైద‌రాబాద్ బొమ్మ‌

- Advertisement -

గురు సినిమాతో విజ‌యం అందుకున్న వెంకటేశ్ త‌ర్వాతి చిత్రాన్ని ప్రారంభించాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకులాట చేస్తున్నారు. వెంక‌టేశ్‌తో న‌టించేందుకు హీరోయిన్ల వెతుకులాట‌లో ఉన్న చిత్ర‌బృందం చివ‌రికి హైదరాబాదీ బ్యూటీ అదితిరావ్ ఎంపికైంద‌ని తెలుస్తోంది.

హైద‌రాబాద్‌కు చెందిన అదితిరావ్ తెలుగులో కాకుండా బాలీవుడ్‌కు వెళ్లింది. బాలీవుడ్‌లో న‌టిస్తున్న స‌రైన విజ‌యాలు లేవు. అయినా ఈ అమ్మ‌డు హాట్‌హాట్ ఫొటోషూట్‌ల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటోంది. సీనియ‌ర్ హీరోయిన్ల క‌న్నా ఈమెతో సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యారంట‌. అనుష్క, కాజల్‌, తమన్నా పేర్లను పరిశీలించారు. కానీ వేరే వాళ్ల‌ను చూస్తున్నారు.

31 ఏళ్ల అదితి బాలీవుడ్‌ చిత్రాల్లో మెరిసింది. మణిరత్నం చెలియా చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం వెంక‌టేశ్ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌-సురేశ్‌ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆధ్వ‌ర్యంలో ఈ సినిమా ఉంది. ఆటా నాదే వేట నాదే అనే పేరు ఫిక్స‌య్యార‌ని తెలుస్తోంది. వచ్చే ఏడాది వేస‌విలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తాడ‌ని టాక్ కూడా వినిపిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -