Sunday, June 16, 2024
- Advertisement -

కాంగ్రెస్ సార‌థిగా రాహుల్‌ ఏక‌గ్రీవ ఎన్నిక‌…

- Advertisement -

ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ పార్టీ నూత‌న అధ్య‌క్షుడిగా రాహుళ్‌గాంధీ ఏక‌గ్రీవంగాఎన్నిక‌య్యారు. ఆయ‌న పార్టీ అధ్య‌క్షుడిగా ఈనెల 16 బాధ్య‌తులు చేప‌ట్ట‌నున్నారు. ఏ మేరకు పార్టీ ఎన్నికల కమిటీ చీఫ్‌ ముళ్లపల్లి రామచంద్రన్‌ ప్రకటన చేశారు.అధ్యక్ష పదవికోసం మొత్తం 89 నామినేషన్‌లు వచ్చాయని, అలా నామినేషన్‌ వేసిన వారంతా వెనక్కు తీసుకోవడంతో రాహుల్‌గాంధీ ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఎంపికైనట్లు ప్రకటించారు.

అధ్యక్ష బాధ్యతలు అధికారికంగా ప్రకటించడంతో నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి పార్టీ బాధ్యతలు అందుకోనున్న ఆరో వ్యక్తిగా రాహుల్‌ నిలవనున్నారు. సోనియాగాంధీ, ఇతర సీనియర్‌ నేతల సమక్షంలో 16న ఏకగ్రీవంగా ఎన్నికైన రాహుల్‌కు ధ్రువపత్రాన్ని అందుకుంటారు. 2004లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రాహుల్‌ అప్పటి నుంచి వివిధ విభాగాల్లో పనిచేశారు. 2007లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ సారథ్య బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2013లో రాహుల్‌ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ దాదాపు 20 ఏళ్లు (సరిగ్గా 19 ఏళ్లు) పనిచేశారు. ఇదిలా ఉండగా రాహుల్‌గాంధీని పార్టీ ప్రకటించడంతో అంతటా కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. పలువురు సీనియర్‌ నేతలు రాహుల్‌కు అభినందనలు తెలుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -