Thursday, April 18, 2024
- Advertisement -

అవినాష్ బిగ్ బాస్ కు ఎందుకు వెళ్లాడో బయటపెట్టిన హైపర్ ఆది..!

- Advertisement -

హైపర్ ఆది తన అదిరిపోయే కామెడీతో జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆది తన స్కిట్ ద్వారా ఎవర్ని వదలకుండా అందరిపై పంచ్ లు వేస్తూ ఉంటాడు. జబర్దస్త్ కంటెస్టులతో పాటు జడ్జిలపై కూడా పంచులు వేసి నవ్విస్తాడు. బయట ట్రెండింగ్ న్యూస్ ఏం ఉన్న వాటిపై కూడా పంచ్ లు వేస్తాడు. జబర్దస్త్ లో ఆది స్కిట్ మాత్రమే చూసేవారు ఎక్కువ మంది ఉన్నారు. తన టీంలో ఉండే దొరబాబు.. తదితర కంటెస్టులపై నిత్యం పంచ్ పేలుస్తూ ఆది ఆకట్టుకోవడం చూస్తూనే ఉన్నాం.

ఇక తాజాగా జబర్దస్త్ నుంచి అవినాష్ ‘బిగ్ బాస్’కు వెళ్లడంపై ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ ద్వారానే ముక్కు అవినాష్ మంచి కమెడీయన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల బిగ్ బాస్-4లోకి వెళ్ళాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో గేమ్ ఆడుతూ కామెడీ చేస్తూ అందర్ని నవ్విస్తున్నాడు. అవినాష్ బిగ్ బాగ్ లోకి ఎందుకు వెళ్ళాడు అనే విషయం ఆది తన స్కిట్ లో రివిల్ చేశాడు. స్కిట్‌లో భాగంగా హైపర్ ఆది వంటమాస్టర్ గా కన్పించాడు. ఆది భార్యగా శాంతి స్వరూప్ కన్పించాడు.

వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ద్వారా అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై ఆది పంచ్ వేశాడు. స్కిట్ లో భాగంగా ఆదితో తన భార్య ‘ఎంత కాలమని ఇలా గరిటే పట్టుకొని వంటలు చేసుకుంటాం.. కనీసం ఈఎంఐలో ఒక ఇల్లు తీసుకోవచ్చుగా.. అని అంటోంది. దీనికి ఆది స్పందిస్తూ ‘వాటి గురించి మాట్లాడకు.. ఇలా హౌస్‌లకు ఈఎంఐలు కట్టలేకే మనోడు ఒకడు వేరే హౌస్‌కు వెళుతున్నాడు తెలుసుగా..’ అంటూ ఆది సెటైర్ వేశాడు. అవినాష్ కేవలం ఇంటి అప్పు తీర్చేందుకే బిగ్ బాస్ హౌజ్ వెళ్లాడనే రహస్యాన్ని ఆది ఇన్ డైరెక్ట్ గా అందరికి చెప్పేశాడు.

యాంకర్ ప్రదీప్ కి పెళ్లి.. పెళ్లి కూతురేవరంటే..?

బిగ్ బాస్ హౌస్ లో కాస్టింగ్ కౌచ్.. చెప్పుతో కొట్టాలి : కళ్యాణి

సూర్య కిరణ్ కి వార్నింగ్ ఇచ్చిన కళ్యాణి.. ఎందుకు ?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాక్షిదీక్షిత్ హౌస్ ఎవరికి పడిపోయిందంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -