Friday, May 3, 2024
- Advertisement -

వారి కొసం జగన్ వ్యూహం ఎంటి..?

- Advertisement -

వైస్ జగన్ సీఎం అవడానికి పదేళ్లు కష్టపడ్డారని చెప్పొచ్చు.. ఎలాంటి రాజకీయ బలం లేని వేళా ఒంటరిగా ప్రజల అండతో జగన్ పార్టీ పెట్టి ప్రజల్లోకి దూసుకుపోయారు.. అయితే మొదటి ఎన్నికల్లో జగన్ గెలవలేకపోయినా రెండు సారి మాత్రం అత్యధిక మెజారిటీ తో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.. అయితే జగన్ ఇంత స్థాయి కి రావడానికి అయన ఒక్కరి కృషి ఉందంటే ఎవరు ఒప్పుకోరు.. ఎందుకంటే అయన గెలవడానికి ముఖ్య కారణం ప్రజలు అయితే ప్రధాన కారణం అయన వెన్నంటి ఉన్న కొంతమంది నేతలు, కార్యకర్తలు.. వీరు ఎలాంటి స్వార్ధం లేకుండా జగన్ కోసం, పార్టీ కోసం పనిచేసిన వారే..

రాజకీయంలో తమకు ఎంతో కొంత లభ్ది చేకూరుతుంది అని చాలామంది ఆశించేవారు.. అలా జగన్ కోసం కొంతమంది కొన్ని లాభాలు ఆశించే ఆయనకు సపోర్ట్ చేశారు.. అయితే అలాంటి ఆశావహులు జగన్ పట్టించుకోకపోవడం ఆ వర్గానికి మింగుడు పాడడం లేదట. జగన్ ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు తొంభై శాతం హామీలు నెరవేర్చి ప్రజల దృష్టిలో దేవుడిగా ఉన్న జగన్ సొంత పార్టీ ని గెలిచిపించిన నేతల విషయంలో అయితే రాక్షసుడిలా మిగిలిపోతున్నారు.. మంత్రి పదవుల విషయంలో లేని రిజర్వేషన్లు పెట్టి కష్టపడినా వారికి మొండి చేయి చూపించారని జగన్ పై సొంత పార్టీ నేతల అభియోగం.. ఈ అభియోగాన్ని బలపరుస్తూ జగన్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్ప్పుడు అంతటా చర్చకు దారి తీస్తుంది..

పార్టీ కోసం పనిచేసిన చాలామందికి శాసనమండలి లో ఎమ్మెల్సీ గా అవకాశం ఇస్తానని చెప్పి చివరకి శాసనమండలి రద్దు చేయడం పై కొంతమంది ఆశావహులు అసంతృప్తికి లోనయినట్లు తెలుస్తుంది.. ఏపీలో శాస‌న మండలి లో పలువురికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని జగన్ ఎన్నికల సభల్లోనూ చెప్పుకొచ్చారు. అటువంటి జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే మండలిని రద్దు చేయాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా బిల్ల్ పాస్ చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం ఇంకా ఆ బిల్లును పరిశీలనలో ఉంచగా ఒకవేళ కేంద్రం ఆమోదం తెలిపితే తమ పరిస్థితి ఏంటి అన్నది వారి ప్రశ్న.. మరో ఆరు నెలలు కళ్ళు మూసుకుంటే శాసన మండలిలో వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. ఆ మీదట మరో ఏడాదికి పూర్తి ఆధిపత్యం వస్తుంది. ఈ లెక్కలు ఇలా ఉంటే జగన్ మాత్రం ఎందుకో మొండిగా మండలి రద్దు అన్న దానిమీదనే ఉన్నారని పార్టీలో అసంత్రుప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆశావహుల మెప్పు కోసం జగన్ ఎలాంటి వ్యూహం రచిస్తారో చూడాలి..

సీఎం జగన్ ప్లాన్ కి విలవిలలాడుతున్న చంద్రబాబు..!

సోము దూకుడుకు కారణం ఇదా..?

టీడీపీ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న టీడీపీ నేతలు..?

జగన్ కంటే బాబు హయంలోనే ఎక్కువ దాడులు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -