మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. గతంలోనే తాను ఏంటో నిరుపించుకుంది తమన్నా. అందం, నటనతోపాటు హీరోలతో సమానంగా డ్యాన్స్ వేసే హీరోయిన్స్ ఎవరైన ఉన్నరంటే అది ఖచ్చితంగా తమన్నానే. తాను నటించే ప్రతి సినిమానే అదే తన మొదటి సినిమా అని భావించి చేస్తానని చెప్పి అందరికి ఆదర్శంగా నిలిచింది. తాజాగా ఈ భామ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఇండస్ట్రీ మహిళలపై మాట్లాడింది.
నన్ను ఫలాన సీన్లో నటించమని ఎవరు బలవంత పెట్టలేదని తెలిపింది. లిప్‌లాక్‌లకు తాను ఏమి వ్యతిరేకం కాదని తెలిపింది. నా కెరీర్ స్టార్టింగ్‌లో నేను శృంగాభరిత సన్నివేశాల్లో నటించానని చెప్పుకొచ్చింది. ఈ సీన్ల నా పాత్రపై క్లారిటీ ఉంది, తననెవరూ బలవంతపెట్టలేరని తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఫలానా అభ్యంతకర సన్నివేశంలో నటించాలని ఇబ్బంది పెట్టారన్నా అందులో నిజం ఉండదని మిల్కీ బ్యూటీ తెలిపింది.
ఏ ఆర్టిస్ట్ అయిన తనకు నచ్చితేనే ఈ సీన్లో నటిస్తుందని, ఇష్టం లేకపోతే అక్కడే చెప్పేసి ఆ సీన్ వద్దని చెబుతారని తెలిపింది. ముద్దు, శృంగారభరితమైన సన్నివేశాల్లో నటించాలని తనను ఎవ్వరూ బలవంతపెట్టరని తెలిపింది.పొరపాటున నన్ను ఆ సన్నివేశంలో నటిచమని బలవంతం చేశారని ఎవ్వరైన చెబితే అస్సలు నమ్మకండని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపింది మిల్కీ బ్యూటీ.
