Friday, April 19, 2024
- Advertisement -

ర‌స‌వ‌త్త‌రంగా అనంత టీడీపీ రాజ‌కీయం….సందిగ్ధంలో బాబు

- Advertisement -

అన్ని పార్టీలు త‌మ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించి ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతుంటే బాబు మాత్రం ఇంకా కొన్ని నోయోజ‌క వ‌ర్గాల అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌కుండా పెండింగ్‌లో పెట్టారు. దీనికి కార‌ణం ఆనియోజ‌క వ‌ర్గాల్లో నెల‌కొన్న ఆధిప‌త్య‌పోరు. ప్ర‌ధానంగా అనంత‌పురం టికెట్ల కేటాయింపు బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జేసీ కుటుంబంనుంచి బాబుకు ఇబ్బందులు ఎద‌ర‌వుతున్నారు.

అనంత‌పురం ఎంపీగా త‌న కొడుకు జేసీ ప‌వ‌న్‌రెడ్డికి టికెట్ ద‌క్కించుకున్న జేసీ కొడుకు గెలుపుకోసం తీవ్ర ప్ర‌త‌య్నాలు చేస్తున్నారు. అయితే నాలుగు నియోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల‌ను మార్చాల్సిందేనిని టీడీపీ అధిష్టానానికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. తమ ఎంపీ సీటు పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగింట తాము చెప్పిన వారిని అభ్యర్థులుగా నిలబెట్టకపోతే.. తన తనయుడు పోటీచేయడని, ఓడిపోవడానికి పోటీచేయడానికి తాము రెడీగా లేనట్టుగా జేసీ ప్రకటించారు.

గుంతకల్ – శింగనమల – అనంతపురం అర్బన్ – కల్యాణదుర్గం.. ఈ నాలుగు నియోజకవర్గాల విషయంలో తెలుగుదేశం పార్టీలో ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఇక్క‌డి అభ్య‌ర్ధుల‌ను మార్చాల‌ని జేసీ ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే బాబు మాత్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నారు. సిట్టింగ్‌ల‌ను మార్చాల‌ని బాబు భావిస్తున్నా వారిస్థానంలో ప్ర‌త్యేమ్నాయ నేత‌లు క‌నిపిండంలేదు. ఒకవేళ జేసీ చెప్పిన వారికే టికెట్లను కేటాయిస్తే.. సిట్టింగులు ఊరికే ఉండరు! వారు కచ్చితంగా రెబల్స్ గా రంగంలోకి దిగుతారు. సిట్టింగ్‌లు రెబ‌ల్స్‌గా దిగితే టీడీపీకీ క‌ష్టాలు త‌ప్ప‌వు. అందునా టీడీపీకీ అనంత‌పురం కంచుకోట‌.

అనంతపురం అర్బన్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రిని జేసీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. గ‌త కొన్నాళ్లుగా వారి మ‌ధ్య అధిప‌త్య‌పోరు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. జేసీకి త‌లొగ్గి బాబు ప్ర‌భాక‌ర్ చౌద‌రికి టికెట్ ఇవ్వ‌క‌పోతె ఆయ‌న ఖ‌శ్చితంగా రెబ‌ల్‌గా బ‌రిలోకి దిగుతారు. ఇక గుంతకల్, శింగనమలలో కూడా ఇదే ప‌రిస్థితి. శింగమనలలో జేసీ చెబుతున్న వారికి కనీస గుర్తింపులేదు. తను చెప్పినట్టుగా నాలుగు సీట్లలో అభ్యర్థులను మార్చకపోతే.. పోటీచేసేందుకు రెడీగా లేనట్టుగా చెప్పిన జేసీ టీడీపీకి రాజీనామా చేస్తాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. మ‌రి జేసీ ఒత్తిడికి బాబు త‌లొగ్గుతాడో లేక సిట్టింగ్‌ల‌కే సీట్లు కేటాయిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -