నాకు ఆ అలవాటు ఉంది రణ్‌బీర్‌ కపూర్

చాలాకాలం త‌రువాత హిట్ కొట్టాడు బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌.బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్ జీవితాధారంగా తెర‌కెక్కించిన సినిమా ‘సంజు’.ఈ సినిమా గ‌త‌వారం విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. సినిమాలో సంజయ్‌ పాత్రలో మాదకద్రవ్యాలకు అలవాటుపడిన క్యారెక్ట‌ర్‌లో రణ్‌బీర్ జీవించాడ‌ని అంద‌రు ప్ర‌శంసిస్తున్నారు.అయితే త‌న‌కు నిజ జీవితంలో మాదకద్రవ్యాలకు అలవాటు ఉంద‌ని తెలిపాడు.

కాలేజ్‌లో ఉన్నప్పుడు మాదకద్రవ్యాలు అలవాటు చేసుకున్నానని, అది తనపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపాడు. ఇలాగే డ్రగ్స్‌ వాడకాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావని అనుకునేవాడినని పేర్కొన్నాడు. తనకు ఇప్పటికీ నికోటిన్‌ అలవాటు ఉందని వెల్లడించాడు.