Monday, May 13, 2024
- Advertisement -

చిరు సినిమాలో జూనియర్ ఆర్టిస్టు వేషం దక్కినా చాలంటున్న హీరో!

- Advertisement -

ఇప్పటికే ఇండస్ట్రీలో అనేక మంది హీరోలు తాము మెగాస్టార్ ఫ్యాన్స్ అని చెప్పుకొంటూ ఉంటారు. వీరు ఈ భక్తిని అనేక విధాలుగా చాటుకొంటూ ఉంటారు.

కొన్ని సినిమాల్లో అయితే ఈ హీరోలే చిరంజీవి కి కటౌట్లు కట్టే అభిమానులుగా కనిపిస్తూ ఉంటారు. రవితేజ వంటి హీరోలు ఇలా కనిపించారు. ఇక ఈ మధ్యనే చిరంజీవి అవరయ్యవ పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై సినిమా వాళ్లలో ఉన్న గౌరవాభిమానాలను అందరూ గమనించారు.

మరి ఇదే సందర్భంలో జరిగిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా ఆడియో విడుదల వేడుకలో ఆ సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతకీ ఆయన ఏమంటాడంటే.. చిరంజీవి సినిమాలో తనకు ఒక పాత్ర చేయాలని ఉందని అంటున్నాడు. అది కనీసం జూనియర్ ఆర్టిస్టు వేషం అయినా చాలని అంటున్నాడు. ఆ చారిత్రాత్మక వెంచర్ లో అలా పాలు పంచుకోవాలనేది ఈ హీరో ఉద్దేశం. కోరిక. ఈ విధంగా మేనమామపై అభిమానాన్ని చాటుకొన్నాడు. 

మరి చిరంజీవి తన మేనల్లుడి కోరికను తీరుస్తాడేమో చూడాలి. చిరంజీవి 150 వ సినిమా అనేది ప్రస్తుతానికి వార్తల్లో లేని అంశమే అని చెప్పాలి. ఎందుకంటే.. 150 వ సినిమా సంగతి ఎలా ఉన్నా.. చిరంజీవి తన తనయుడి సినిమాలో గెస్ట్ రోల్ చేయడం ఖాయమైంది. ఒక రకంగా చెప్పాలంటే అదే చిరంజీవి 150 వ సినిమా అవుతుంది!  కాబట్టి.. సాయి ధరమ్ తేజ్ వంటి వారి కోరికలు ప్రస్తుతానికి తీరే అవకాశాలు లేనట్టే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -