Thursday, May 16, 2024
- Advertisement -

సినిమాల‌కు దూరంగా ఉంటా: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

- Advertisement -

దాదాపు 25 సినిమాలు చేశాడు.. వేలాది మంది వీరాభిమానుల‌ను సంపాదించుకున్నాడు.. న‌టుడిగా ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నాడు.. దాదాపు 20 ఏళ్ల పాటు సినీ రంగంలో ఏలాడు.. చివ‌రికి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టాడు. మారిన ప‌రిస్థితుల‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇక సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు.

మొద‌టి సినిమా అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయితో మొద‌లైన ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి సినిమానే చివ‌రిది కానుంది. 25 సినిమాలు చేశాడు. సినిమా విజ‌యాలు ప‌క్క‌న‌పెడితే త‌న అన్న మాదిరి అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. చిరంజీవి దాదాపు వంద‌కుపైగా సినిమాలు చేసి అభిమానుల‌ను సంపాదించ‌కుంటే ప‌వ‌న్ మాత్రం 25 సినిమాల‌కే బోలెడంత మంది అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్నాడు.

తెలంగాణ జగిత్యాల జిల్లా కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి ద‌ర్శ‌నాంత‌రం విలేక‌రుల స‌మావేశంలో (జ‌న‌వ‌రి 22) సినిమాల్లో న‌టించ‌ను అని ప్ర‌క‌టించారు. త‌న జీవిత‌మంతా ప్ర‌జ సేవ‌కు పాటుప‌డ‌తాన‌ని తెలిపారు. ఈ వార్త ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానుల‌కు చేదు వార్త‌గా మిగిలింది.

https://www.youtube.com/watch?v=7NbNmadAuRA&t=11s

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -