Wednesday, May 1, 2024
- Advertisement -

చాలామందిని బాధ‌పెట్టాను: రోల్ రైడా

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో చివ‌రి ఎలిమినేష‌న్‌లో భాగంగా బ‌య‌ట‌కి వ‌చ్చాడు రోల్ రైడా. షో మొదట్లో ఇత‌ను మొద‌టిలోనే బ‌య‌టికి వ‌చ్చేస్తాడ‌ని అనుకున్నారు అంతా, కాని చివ‌ర వ‌రకు ఉండి అంద‌రిని ఆశ‌ర్చ‌ర్య‌ప‌రిచాడు రోల్ రైడా. ఈ సంద‌ర్భంలో ఓ టీవీ ఛానెల్‌లో మాట్లాడుతు బిగ్‌బాస్ షో గురించి చెప్పుకొచ్చాడు. కౌశల్‌ ఒక మాట అన్నప్పుడు ఎమోషనల్‌గా బస్ట్‌ అయ్యాను. కానీ అలా కాకుండా ఉండాల్సింది. ఏడ్చి చాలా మందిని బాధ పెట్టానని అనిపించింది.

అసలు ఎందుకు అలా అయిందంటే… చెల్లి రావడం, అమిత్‌గాడు వెళ్లి పోవడంతో నాలో ఎమోషనల్‌ స్ట్రెంత్‌ తగ్గిపోయింది. ఒంటరినైపోయాను. అప్పుడే కౌశల్‌ అలా అన్నారు. కెప్టెన్సీ వచ్చేది కాస్త పోయింది. ఇలా ఒక్కసారే చాలా ఫ్యాక్టర్స్, నేను ఎమోషనల్‌గా బ్రేక్‌డౌన్‌ కావడం, ఎగ్స్‌ సామ్రాట్‌కి ఇచ్చేయడం నా ఎలిమినేషన్‌కి కారణం కావచ్చు. ఎగ్స్‌ టాస్క్‌లో గెలిచే అవకాశం ఉంటే గివప్‌ చేసేవాడిని కాదు. నేను గెలవలేదని, ఇంకొకరు గెలవొద్దనే మెంటాలిటీ కాదు నాది కాదంటూ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -