Friday, May 3, 2024
- Advertisement -

ఆ సినిమాలో హీరోగా ట్రై చేశా – కౌశ‌ల్

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్న‌ర్ కౌశ‌ల్ ఓ టీవీ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతు ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌లను చెప్పుకొచ్చాడు. “మొదటి నుంచి కూడా నేను మోడలింగ్ పై దృష్టిపెడుతూ వచ్చాను. అలా మోడలింగ్ వైపు అడుగులు వేస్తోన్న సమయంలోనే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బ‌బు త‌న‌కు స‌హ‌యం చేశారని తెలిపాడు కౌశ‌ల్‌.దర్శకుడు రాఘవేంద్రరావు,నిర్మాత అల్లు అరవింద్ కొత్త వారితో సినిమా చేస్తున్నారని తెలిసి ఆ సినిమాలో హీరో కోసం ట్రై చేశాన‌ని చెప్పుకొచ్చాడు కౌశ‌ల్‌.

ఆ సినిమానే ప‌ర‌దేశి, సినిమాకి అవసరమైన హీరో హీరోయిన్ల కోసం ఒక రియాలిటీ షో పెట్టారు. అప్పుడు లక్ష అప్లికేషన్స్ వస్తే పది మంది అబ్బాయిలను,పది మంది అమ్మాయిలను సెలెక్ట్ చేశారు. ఆ పది మంది అబ్బాయిల్లో నేను ఒకడిని. నాతో పాటు శివాజీ .. లయ .. ప్రత్యూష కూడా వున్నారు. ఆ సినిమాలో హీరోగా నేను సెలెక్ట్ కాకపోయినా, ఆ తరువాత ‘రాజకుమారుడు’ సినిమాలో మహేశ్ బాబు ఫ్రెండ్ గా నటించాను. అలా నటుడిగా నా కెరియర్ మొదలైంది అని చెప్పుకొచ్చాడు కౌశ‌ల్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -