- Advertisement -

ఐబొమ్మ కీలక ప్రకటన

- Advertisement -

సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఉచితంగా అందించే ప్రముఖ స్ట్రీమింగ్ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBOMMA), భారతదేశంలో తమ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులకు ఒక సందేశాన్ని విడుదల చేసింది.

ఐబొమ్మ విడుదల చేసిన సందేశంలో, తమ నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరింది. ఇటీవల మీరు మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మాకు విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను భారత్‌లో శాశ్వతంగా నిలిపివేస్తున్నాం. మా సేవలను నిలిపివేస్తున్నందుకు చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం అని పేర్కొన్నారు.

ఐబొమ్మ సేవలు నిలిపివేయడానికి గల కారణాలను వెబ్‌సైట్ స్పష్టంగా వెల్లడించనప్పటికీ, చట్టపరమైన లేదా సాంకేతికపరమైన అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఐబొమ్మ ప్రకటనతో భారత్‌లో దాని సేవలు అధికారికంగా ముగిసినట్లయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -