- Advertisement -

మేము క్షేమంగానే ఉన్నాం:గుంటూరు యాత్రికులు

- Advertisement -

మేము క్షేమంగానే ఉన్నాం అని ఉమ్రా యాత్రకు వెళ్లిన ఆంధ్రావాసులు వీడియో విడుదల చేశారు. తామంతా గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి ఉమ్రా యాత్రకు వచ్చామని తెలిపారు యాత్రికులు.

సౌదీలో జరిగిన ప్రమాదం గురించి తెలిసిందని.. అల్లా దయతో తాము మాత్రం క్షేమంగానే ఉన్నామని వెల్లడించారు. యాత్రను పూర్తి చేసుకుని త్వరలోనే స్వస్థలాలకు చేరుకుంటామని స్పష్టం చేశారు.

సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందారని హజ్ కమిటీ తెలిపింది. ఒకే కుటుంబంలో 18 మంది మృతి చెందారు. నసీరుద్దీన్ సహా కుమారుడు, కుమార్తెలు, కోడళ్లు, పిల్లలు సహా మొత్తం 18 మంది మృతి చెందారు. ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్న నసీరుద్దీన్ కుమారుడు సిరాజుద్దీన్.

ప్రస్తుతం ఆ కుటుంబంలో అతను ఒక్కడే మిగిలినట్లు సమాచారం. హైదరాబాద్-విద్యానగర్ ప్రాంతంలోని నసీరుద్దీన్ ఇంటికి వెళ్లారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -