అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 22 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలుసుకున్న శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాలలో సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించారు.
ఈ సందర్భంగా విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ ను నిర్వీర్యం చేసి అంధకారంలో నెడుతూ పరిపాలన చెయ్యడం దుర్మార్గమైన చర్య, గత నెలలో కురుపాం నియోజకవర్గం గిరిజన ఆశ్రమ పాఠశాలలో సుమారు 120 మంది విద్యారులు అస్వస్థతకు గురై 5 గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే వరుస సంఘటనలు జరగడం బాధాకరమన్నారు.
మొన్నటికి మొన్న గూడెం కొత్త వీధి మండలం జర్రెల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల సుమారు 50 మంది విద్యర్థులు ఆసుపత్రి పాలై వారి ఆరోగ్యం కుదుటపడకముందే నిన్న రాత్రి కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాలలో సుమారు 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం చాలా దారుణమని అన్నారు, ఇలాంటి వరుస సంఘటనలు జరగడం వల్ల విద్యార్థుల తల్లి దండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటేనే తీవ్ర భయాందోళనతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పనుండి రాష్ట్ర ప్రజలు గుడికి వెళ్లినా, బడికి వెళ్లినా తమ మాన ప్రాణాలకు భద్రత కల్పించలేని దుస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
