Friday, May 3, 2024
- Advertisement -

రిపోర్టర్ పై ఆగ్రహాంతో …. ఇలియానా

- Advertisement -

ఇలియానా బాలీవుడ్‌కి వెళ్లిన త‌రువాత ద‌క్షిణాది సినిమాల‌పై ఘాటు కామెంట్స్ చేసింది. ఇక్క‌డ హీరోయిన్‌ల‌ను కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమితం చేస్తార‌ని న‌టించడానికి అవ‌కాశం ఇవ్వ‌రు.అని తెలుగు సినిమాల‌పై కామెంట్ చేసింది. ఈ భామ ఇటీవ‌ల కాలంలో వార్త‌ల్లో నిల‌వ‌డానికి ఎక్కువ ప్రాధ్యాన‌త ఇస్తున‌ట్లు తెలుస్తుంది.ఇలియానా ప్రస్తుతం రెయిడ్ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.అజయ్ దేవగన్ తో కలిసి పబ్లిసిటీ యాక్టివిటీస్ లో తెగ పార్టిసిపేట్ చేస్తోంది.రిపోర్టర్ ఇంట‌ర్వూలో భాగంగా సూపర్ స్టార్ అజయ్ దేవగన్.. ఇలియానా డిసౌజాలతో ఇక్కడ ఉన్నాం’ అన్నాడు.

ఇక్క‌డ ఇలియానా ఇంటి పేరు మార్చేశాడు రిపోర్టర్ .పైగా హీరోను స్టార్ అని ఇలియానాను ఏక‌వ‌చ‌నంతో పిల‌వ‌డంతో ఇల్లీ బేబికి చిర్రెత్తుకు వ‌చ్చినట్లు ఉంది.దీంతో రిపోర్టర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్త‌ప‌రిచడ‌మే కాక‌.. నువ్వు ముందు కొంత హోంవర్క్ చేసి రావాల్సి ఉందని.. పేర్లను ఇలా మిక్స్ చేసేస్తుంటే చాలా చిరాగ్గా అనిపిస్తోందని చెప్పేసింది ఇలియానా..హీరోని స్టార్ అని పిలిచి హీరోయిన్‌ను ఏక‌వ‌చ‌నంతో పిల‌వ‌డం మ‌ర్యాద అనిపించుకోదు అని ఆ రిపోర్టర్‌కు చురక‌లు అంటిచింది ఇల్లీ బేబి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -