Monday, April 29, 2024
- Advertisement -

బాబుకు దిమ్మతిరిగే షాక్….. జగన్ పాదయాత్రలో టిడిపి నుంచి వైకాపాలోకి భారీ చేరికలు

- Advertisement -

మొదట్లో ప్రజా సంకల్పయాత్రను చాలా లైట్ తీసుకున్నాడు చంద్రబాబు. అయితే జగన్ పాదాయత్రకు వస్తున్న ఆదరణ చూసి ముందుగా జనాలను కట్టడి చేయాలనుకున్నాడు. కుదరలేదు. ఆ తర్వాత నుంచి టిడిపి నుంచి వైకాపాలోకి జంప్ అయ్యే నాయకులను ముందుగానే గుర్తించి జగన్ సమక్షంలో వైకాపాలోకి చేరికలు ఆపాలనుకున్నాడు. అయితే తన సొంత జిల్లాలుగా చంద్రబాబు భావించే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా వైకాపాలోకి భారీగా చేరికలు ఉండే అవకాశం కనిపిస్తోంది. చిత్తూరులో పుట్టినప్పటికీ రాయలసీమ విషయంలో చంద్రబాబుకు పెద్దగా పట్టింపులు లేవు. కానీ కృష్ణా-గుంటూరు జిల్లాలపైన మాత్రం చాలా ప్రేమ చూపిస్తాడు. కారణాలు అందరికీ తెలిసినవే. అలాంటి గుంటూరు జిల్లాలో ఇప్పుడు చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకులు తగుల్తున్నాయి. కారణాలు తెలియదు కానీ జగన్ పాదయాత్ర గుంటూరులో ప్రవేశించినప్పటి నుంచి టిడిపి స్థానిక నేతలు చాలా మంది జగన్ సమక్షంలో అనుచరులతో సహా వైకాపాలో చేరిపోతున్నారు. నిన్న కూడా అలాంటి చేరికలు భారీగా చోటు చేసుకున్నాయి.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు షేక్ యాసిన్ జగన్ సమక్షంలో వైకాపాలో చేరాడు. జగన్ బిజెపితో కుమ్మక్కయ్యాడని బాబు అండ్ కో చేస్తున్న ఆరోపణలను షేక్ యాసిన్ తీవ్రంగా ఖండించాడు. ముస్లిములను మనస్ఫూర్తిగా ప్రేమించిన నేతలుగా వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు ఎప్పటికీ నిలిచిపోతారని, ఎన్నికల సమయంలో ముస్లిం ఓట్ల కోసం వైఎస్‌లు ఎప్పటికీ నాటకాలు ఆడరని యాసిన్ చెప్పుకొచ్చాడు. టిడిపికి చెందిన పొన్నూరు జెడ్పీటీసీ సభ్యుడు తోట శ్రీనివాసరావు, టిడిపి పట్టణ మాజీ అధ్యక్షుడు షేక్ పెద్ద గఫార్, టిడిపి నాయకురాలు మండ్రు అనిత, జనసేన నాయకుడు పసుపులేటి శ్రీనివాసరావుతో సహా టిడిపి ఎంపిటీసీలు, సర్పంచులు అనుచరులతో కలిసి భారీ సంఖ్యలో వైకాపాలో చేరారు. 2019 ఎన్నికల తర్వాత కనీసం రైతులు బ్రతికి బట్టకట్టాలంటే కూడా వైకాపాను గెలిపించాలని………మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతు అన్నవాడే ఎవ్వడూ మిగలడని రైతు నాయకులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

మామూలుగా అయితే అధికార పార్టీలోకి నేతల చేరికలు కామన్‌గా జరుగుతూ ఉంటాయి. కానీ టిడిపిలో ఉన్న పట్టణ, జెడ్పీటీసీ, ఎంపిటీసీ స్థాయి నాయకులు వైకాపాలో చేరడం మాత్రం రాజకీయ విశ్లేషకులను ఆశ్ఛర్యపరుస్తోంది. సర్వేలతో పాటు వైకాపాలోకి చేరికలు కూడా 2019 ఎన్నికల ఫలితాల్లో విజేత ఎవరో తేల్చి చెప్పేలా ఉన్నాయని సీనియర్ జర్నలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -