Monday, May 6, 2024
- Advertisement -

ముక్కోన‌పు ట్రై సిరీస్‌లో ఫైన‌ల్‌కి వెల్లిన భార‌త్‌…

- Advertisement -

కొలంబో వేదికగా జరుగుతున్న నిద‌హాస్ ముక్కోన‌పు ట్రోపీలో భాగంగా టీమిండియా ఫైన‌ల్‌కు చేరింది. బంగ్లాతో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘ‌న‌విజ‌యం సాధించి ఫైన‌ల్ బెర్త్‌ను ఖ‌రారు చేసుకుంది. మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (89: 61 బంతుల్లో 5×4, 5×6), స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (3/22) అద్భుత ప్రదర్శన చేయడంతో బంగ్లాదేశ్‌ని 17 పరుగుల తేడాతో భారత్ చిత్తుగా ఓడించింది.

మొదట బ్యాటింగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మ్యాచ్‌లో రోహిత్ శర్మ, సురేశ్ రైనా (47: 30 బంతుల్లో 5×4, 2×6) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముష్ఫికర్ రహీమ్ (72 నాటౌట్: 55 బంతుల్లో 8×4, 1×6) చివరి వరకూ ఒంటరి పోరాటం చేసినా బంగ్లాదేశ్‌ని గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో ఆ జట్టు చివరికి 159/6కే పరిమితమైంది.

గత కొద్ది రోజులుగా నిలకడలేమితో సతమతమవుతున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 89 ( 61 బంతులు, 5 ఫోర్లు 5 సిక్సులు) ఎట్టకేలకు ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. అర్థ సెంచరీ వరకూ నిలకడగా ఆడిన రోహిత్‌ తరువాత తనదైన శైలిలో చెలరేగాడు. రోహిత్‌కు తోడు సురేశ్‌ రైనా 47(30 బంతుల్లో 5 ఫోర్లు,2 సిక్సులు), శిఖర్‌ ధావన్‌‌(35, 27 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సు)లు రాణించడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

ఇక బంగ్లా ప‌త‌నాన్ని టీమిండియా యువ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుంధర్ శాసించాడు. అద్భుత బౌలింగ్‌తో బంగ్లాను ఆదిలోనే దెబ్బకొట్టాడు. గత శ్రీలంక మ్యాచ్‌లో చెలరేగిన లిటన్‌ దాస్‌ (7), సౌమ్య సర్కార్‌ (1),లతో పాటు తమీమ్‌ ఇక్బాల్‌ (27)ను సుందర్‌ పెవిలియన్‌కు పంపించాడు. నాలుగు ఓవర్ల వేసిన సుందర్‌ 13 డాట్‌ బంతులు వేయడం విశేషం.

భారీ స్కోరు దిశగా సాగిపోతున్న భారత్‌ జోరుకి రుబెల్ హుస్సేన్ కళ్లెం వేశాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన రుబెల్ బౌలింగ్‌లో యార్కర్‌ని ఆడటంలో విఫలమైన శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డయ్యాడు. అర్థ‌శ‌త‌కం వ‌ర‌కు ఆచితూచి ఆడిన రోహిత్ త‌ర్వాత ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడి.

మరో ఎండ్‌లోని రైనా కూడా బ్యాట్ ఝళిపించడంతో.. బంగ్లా బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో.. 15 ఓవర్లు ముగిసే సమయానికి 117/1తో ఉన్న టీమిండియా.. ఆ తర్వాత ఓవర్లలో వరుసగా 9, 14, 21, 11, 4 పరుగులు రాబట్టేసింది. చివరి ఓవర్‌లో తొలి బంతికి రైనా ఔటవగా.. ఆఖరి బంతికి రోహిత్ శర్మ రనౌటయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -