Thursday, May 16, 2024
- Advertisement -

తల్లి కాబోతున్నా ఇలియానా

- Advertisement -

టాలీవుడ్‌లో ఫ‌స్ట్ కోటి రూపాయిల పారితోష‌కం తీసుకున్న హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చ‌కుంది గోవా బ్యూటీ ఇలియానా. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌ను ఇలియానా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె నేరుగా వెల్లడించకపోయినా.. సోషల్‌మీడియాలో తన ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ‘హబ్బీ’ అని సంబోధిస్తుంటారు.అయితే ఇప్పుడు ఇలియానా తల్లి కాబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ‘రెయిడ్‌’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇలియానా తాను గర్భం దాల్చిన సంగతి తెలీకుండా ఉండేందుకు తేలికైన దుస్తులు ధరించారని బీటౌన్ వర్గాలు అంటున్నాయి. అదీకాకుండా ఆండ్రూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య ఫొటోను షేర్‌ చేశారు. ఫొటోలో ఇలియానా బాత్‌టబ్‌లో సేదతీరుతూ కాఫీ తాగుతూ కన్పించారు.

‘ఇలియానా ఒంటరిగా మధురమైన సమయాన్ని గడుపుతున్నారు’ అని క్యాప్షన్‌ ఇవ్వడంతో ఆమె గర్భం దాల్చినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా పెళ్లి గురించే ఓ క్లారిటీ ఇవ్వని ఇలియానా ఇక ఈ విషయం గురించి ఏమని చెప్తారో వేచి చూడాలి. టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కి వెళ్లి అక్క‌డ అద‌పా ద‌డ‌పా సినిమాలు చేస్తు బండి లాగించేస్తుంది.టాలీవుడ్‌లో ఫేమ‌స్ అయిన త‌రువాత బాలీవుడ్‌కి వెళ్లి టాలీవుడ్‌పైనే విమ‌ర్శ‌లు చేసింది. అక్క‌డ హీరోయిన్ల‌కు ప్రాముఖ్యం ఉండ‌ద‌ని వారి అందాలు చూపించ‌టానికే హీరోయిన్లు కావ‌ల‌ని టాలీవుడ్‌పైనే కామెంట్స్ చేసింది ఈ గోవా బ్యూటీ.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -