Thursday, May 9, 2024
- Advertisement -

క్రికెట్‌లో క్రిష్టియానో రొనాల్డో కోహ్తీ… బ్రేవో ప్ర‌శంస‌లు

- Advertisement -

పోర్చుగీస్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్‌ అంటే తెలియని క్రీడాభిమానులు ఉండరేమో..! పాదరసంలా కదులుతూ.. తనదైన విన్యాసాలతో బంతిని గోల్ పోస్టుకి తరలించడంలో రొనాల్డ్ తర్వాతే ఎవరైనా.. అనేంతలా ప్రపంచ వ్యాప్తంగా అతను గుర్తింపు పొందాడు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సారథిగా వ్యవహరిస్తున్న కోహ్లిని ఫుట్‌బాల్‌ లెజండ్‌ క్రిస్టియనో రొనాల్డోతో పోల్చాడు వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో. క్రికెట్‌ ప్రపంచంలో గల క్రిస్టియనో రొనాల్డో.. కోహ్లి అంటూ అభిప్రాయపడ్డాడు.

విరాట్ కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటాన్ని నేను ఇష్టపడతా. అతను ఎప్పుడు మ్యాచ్ ఆడుతున్నా.. చూస్తాను. అది ఐపీఎల్‌లోనైనా.. భారత్ తరఫునైనా.. ఎందుకంటే అతనిలో బ్యాటింగ్ నైపుణ్యానికి నేను ముగ్ధుడ్ని. ఆట పట్ల కోహ్లీకి ఉన్న అంకిత భావం చూస్తుంటే.. అతను ఇప్పటి వరకు సాధించిన విజయాలకి అర్హుడనిపిస్తుంది.

క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డ్‌‌ని విరాట్ కోహ్లి రూపంలో చూశాను. నేను ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడుతున్నాను కాబట్టి.. ఈ మాట చెప్పడం లేదు. అండర్-19 సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి నా సోదరుడు డారెన్ ఆడాడు. అప్పటి నుంచి మా తమ్ముడికి చెప్తున్నా.. విరాట్ కోహ్లి చాలా ఎత్తుకి ఎదుగుతాడని.. నా సోదరుడికి కూడా కొన్ని బ్యాటింగ్ స్కిల్స్ నేర్పించమని కోహ్లీని అప్పట్లో అడిగాను’ అని వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -