- Advertisement -

రాంచ‌ర‌ణ్ కొత్త లుక్ ఇదేనా!

- Advertisement -

రంగస్థలం సినిమాతో రికార్డ్‌లను తిరగరాస్తున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. పాత్రకు తగ్గట్టు ఎలాంటి గెటప్‌లోనైనా ఒదిగిపోతారు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. ‘ధ్రువ’లో రఫ్‌ అండ్‌ టఫ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చరణ్‌ అదరగొట్టేశారు. ఇటీవల విడదలైన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘రంగస్థలం’లో గెడ్డం పెంచుకున్న లుక్‌ అభిమానులకు తెగ నచ్చేసింది. ఇప్పుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రంలో చరణ్‌ నటిస్తున్నారు. చెర్రీ ఈ నెలాఖరున షూటింగ్‌లో పాల్గొననున్నాడు.

ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకునే పనిలో ఉన్నాడు. బోయపాటి సినిమాలో స్టైలిష్‌ లుక్‌ లో అలరించనున్నాడట.ఫిట్‌గా కనిపించేందుకు జిమ్‌లో చెమటోడుస్తున్నాడు. ఈ విషయాన్ని చరణ్‌ భార్య ఉపాసన ట్వీటర్‌ ద‍్వారా వెల్లడించారు. చాలా సేపు కసరత్తులు చేసి అలిసి పోయిన చెర్రీ ఫొటోతో పాటు ‘ఆర్‌సీ 12’ కోసం చరణ్‌ సిద్ధమవుతున్నాడంటూ ట్వీట్‌ చేశారు.ఇందులో చెర్రీకి జోడీగా కైరా అడ్వాణీ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -