Saturday, April 27, 2024
- Advertisement -

ఆకట్టుకుంటున్న‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్!

- Advertisement -

ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’(ఐఎన్‌జీ) జూన్ 18న విడుద‌లవుతుంది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. హవాలా డబ్బు చుట్టూ తిరిగే కథగా కనిపిస్తుంది.. బోల్డ్ కంటెంట్ తో పాటు యాక్షన్ సీరీస్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ప్రియదర్శి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ప్రియ‌ద‌ర్శి, నందినీ రాయ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ఈ అవెయిటింగ్ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను శ‌నివారం తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన స్టార్ హీరో కార్తి విడుద‌ల చేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ వెబ్ సిరీస్ విడుదలపై ఆతృత పెంచేసింది ట్రైలర్. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి. ఆ మద్య ప్రియదర్శి ‘మల్లేశం’ చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -