Sunday, April 28, 2024
- Advertisement -

సౌత్​లో బన్నీ కొత్త రికార్డ్​.. విజయ్​ ని కూడా దాటేశాడే..!

- Advertisement -

అల్లు అర్జున్​ ఇప్పుడు పాన్​ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆయనకు మలయాళంలో అక్కడి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ఉంది. ఇక అల్లు అర్జున్​ నటించిన సినిమాలు హిందీలో డబ్​ చేస్తే.. మిలియన్ల కొద్దీ వ్యూస్​ వస్తుంటాయి. దీంతో ఆయనకు బాలీవుడ్​ లో కూడా మార్కెట్ ఏర్పడింది. ఈ క్రమంలో అల్లు అర్జున్​ ఇప్పుడు దృష్టి ఇప్పుడు పాన్​ ఇండియా మీద పడింది. పుష్ప1, పుష్ప2 సినిమాలను దేశవ్యాప్తంగా రిలీజ్​ కాబోతున్నాయి. ఆ తర్వాత ప్రాజెక్టులు కూడా పాన్​ ఇండియా లెవెల్​లోనే ప్లాన్​ చేస్తున్నాడు అల్లు అర్జున్​.

ఇప్పుడు అల్లు అర్జున్​ .. ఓ సరికొత్త రికార్డ్​ను నమోదు చేసుకున్నాడు. 2020లో వికీపీడియాలో సౌత్​లో ఎక్కువ మంది సెర్చ్​ చేసిన టాప్​ హీరోగా అల్లు అర్జున్​ నిలిచాడు. దాదాపు 2.73 మిలియన్ల మంది అల్లు అర్జున్​ గురించి వికీపీడియాలో వెదికినట్టు సమాచారం. హిందీలో వచ్చిన క్రేజ్ కారణంగానే ఇది సాధ్యమైందని అంటున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ 2.67 మిలియన్ల వ్యూస్​తో రెండో స్థానం దక్కించుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు 2.57మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్నాడు. 2020లో విజయ్ దేవరకొండ వికీపీడియా ప్రొఫైల్ కు 2.37 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Also Read: బన్నీతో కలసి మెగాస్టార్ తీన్ మార్ స్టెప్పులు.. ఫ్యాన్స్ కిక పండగే..!

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. రజనీకాంత్ వికీపీడియా ప్రొఫైల్ కు 2.23మిలియన్ల వ్యూస్ దక్కాయి. వికీపిడియాలో అత్యధికంగా సెర్చ్​ చేసిన వాళ్లలో తెలుగు నటులే అధికంగా ఉండటం గమనార్హం. ఇటీవలి కాలంలో తెలుగు హీరోలు ఎక్కువగా పాన్ ఇండియా రేంజి సినిమాల్లో నటిస్తున్నారు. అంతేకాక మన హీరోలు నటిస్తున్న సినిమాలు ఇందులో హిందీలో డబ్ అయి విడుదల అవుతుండటంతో అక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంటున్నారు.

Also Read: టాప్ డైరెక్టర్లని ‘అల్లు’ కు పోతున్న స్టార్ హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -