Monday, May 13, 2024
- Advertisement -

సారీ చెప్పిన ‘త‌లైవా’ విజయ్

- Advertisement -

త‌మిళ‌నాడులో విజ‌య్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ర‌జ‌నీకాంత్ త‌రువాత అంత‌టి క్రేజ్ విజ‌య్‌కే ఉంది. విజ‌య్ సినిమాలు రీలిజ్ అవుతుంటే బాక్స్‌ఫీస్ షేక్ అవుతాయి. అభిమానులు విజ‌య్‌ను ముద్దుగా త‌లైవా అని పిలుచుకుంటారు. అలాంటి విజ‌య్ చిన్న పొర‌పాటు వ‌ల్ల క్ష‌మాణ‌లు చెబుతున్నాడు. అది దేనికో తెలుసా…విజ‌య్ ప్ర‌స్తుతం మురుగదాస్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు.ఆ సినిమా చెన్నై ‘కోవాలం’ బీచ్‌లో జ‌రుగుతుంది. బీచ్ ను శుభ్రంగా ఉంచడంలో స్థానిక సర్ఫింగ్ క్రీడాకారులు ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు.

40 మంది సర్ఫింగ్ క్రీడాకారులు వాలంటీర్లుగా ఏర్పడి, ఎప్పటికప్పుడు బీచ్ ను శుభ్రం చేస్తున్నారు.సినిమాల షూటింగ్స్ కారణంగా ఆ బీచ్ లో విరిగిపోయిన వస్తువులు .. పగిలిపోయిన గాజు ముక్కలు .. చెత్తా చెదారం పడ్డాయి. వాటిని అక్కడ అలా వదిలేసి ఎవరికివాళ్లు బయల్దేరుతున్నారట. అది గమనించిన సర్ఫింగ్ క్రీడాకారులు, ఈ సినిమా టీమ్స్ ను అడ్డుకున్నారు. బీచ్ ను శుభ్రం చేసిన తరువాతనే అక్కడి నుంచి వెళ్లాలని చెప్పడంతో అలాగే చేశారట. ఈ విషయంపై హీరో విజయ్ స్పందిస్తూ ఫేస్ బుక్ ద్వారా సారీ చెప్పాడు త‌లైవా విజ‌య్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -