సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సెట్స్ మీద ఉండగానే మహేష్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మురుగదాస్ తో సినిమా కంప్లీట్ అవ్వగానే వెంటనే కొరటాల శివ మూవీ నుమహేష్ పట్టాలెక్కించనున్నారు.
అందుకే కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనులను పంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. “భరత్ అను నేను” అనే టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసిన దర్శకుడు ఈ సినిమాని సెప్టెంబర్ 22 తేదీన విడుదల చేయాలనీ మొదట ప్లాన్ చేశారు. జనవరి నుంచి సినిమా మొదలయి ఉంటే అప్పుడే విడుదల అయ్యేది. కానీ మహేష్ 23 సినిమా షూటింగ్ కొనసాగుతోంది.
బహుశా మార్చి డేట్స్ కూడా మురుగుదాస్ సినిమాకి మహేష్ కేటాయించనున్నారు. కొరటాలతో మూవీ మొదలవ్వడం ఆలస్యం కానుండడంతో విడుదల తేదీ మారింది. 2018 సంక్రాంతికి “భరత్ అను నేను” రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. మహేష్, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ అయ్యింది. దీంతో ఈ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
{youtube}aOTxk28az-g{/youtube}
Related