Wednesday, May 15, 2024
- Advertisement -

మహేష్ సినిమా పై రకుల్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

- Advertisement -
Rakul Happy Mahesh Movie Flop

సినిమా పరిశ్రమలో ముక్కు సూటిగా మాట్లాడిన.. లేక మనసులో ఉంది దాచుకోకుండా బయటకు చెప్పిన.. కొన్ని సార్లు మంచిదే కాని.. కొన్ని సార్లు మాత్ర మొదటికే మోసం వస్తుంది. ఇక ఇలాంటి విషయాల్లో హీరోయిన్స్ మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ రకుల్ ప్రీతి సింగ్ కు ఆ అలవాటు ఇంకా రాలేదు అనుకుంటా.. అందుకే ఏ విషయం కూడా మనసులో దాచుకోకుండా బయటకు చెప్పేస్తూ ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనవుతుంది. ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మ మహేష్, నాగ చైతన్య లతో చేస్తున్న సినిమాలు సెట్స్ ఫై ఉన్నాయి.

ఇక  సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేసిన విన్నర్ సినిమా  మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో విన్నర్ ప్రమోషన్ లో పాల్గొన్న రకుల్.. తాను మిస్సైన సినిమా ఫలితాలు చూసి హ్యాపీ గా ఫీల్ అవుతున్నాని చెప్పుకొచ్చింది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం, నాగ చైతన్య తో ఆటో నగర్ సూర్య సినిమాల్లో చాన్స్ వచ్చిందని..కాకపోతే ఆ సమయంలో డేట్స్ లేక ఆ సినిమాలు చేయలేకపోయాయని..కానీ ఆ సినిమాలు చేయకపోవడమే మంచిది అయ్యిందని చెప్పుకొచ్చింది. కానీ ఆ సినిమాలు చేయకపోయిన.. ఆ హీరోలతో మరోసారి చాన్స్ రావడం రావడం హ్యాపీ గా ఉందని తెలిపింది. ఇక రకుల్ మాటలు విన్న మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఆమె మాటల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ప్లాప్ అయితే మాత్రం ఆలా చెప్పాలా అని ప్రశ్నింస్తున్నారు.

{youtube}vBaslIueMhM{/youtube}

Related

  1. మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్!
  2. బాలయ్య సినిమాపై మహేష్ కామెంట్స్!
  3. గాలి నాకంత డబ్బు ఇవ్వలేదు.. రకుల్
  4. గాలి జనార్ధన్ రెడ్డి కూతురి పెళ్లిలో రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -