Sunday, May 12, 2024
- Advertisement -

శంకర్ డిజప్పాయింట్ చేస్తాడా ఏంటి

- Advertisement -

శంకర్ సినిమాలు జనాలకు నచ్చడానికి అతను తీసుకునే కామన్ లైన్ మాత్రమే కాదు…. అంతకుమించిన శంకర్ సినిమాల్లో కనిపించే…వినిపించే సాంగ్స్ ..అవే శంకర్ ను ఎక్కడికో తీసుకుపోయాయి. తాజాగా రాబోతోన్న 2.0 చిత్రం విషయంలో కూడా జనాలు గట్టిగానే ఎక్స్ పెక్ట్ చేసారు. కాని తీరా చూస్తే మ్యూజిక్ విషయంలో మనకు సరైన న్యాయం చేయలేదనే అనిపిస్తుంది.

ఐ మీన్ ఈసినిమాలో సాంగ్స్ భాగా లేదని కాదు. ఒక్కటే థీమ్ సాంగ్ ను సినిమాలో వినియోగించారని తెలుస్తుంది. ఈ మూవీ ఆడియో ఈవెంట్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ‌లో ల్యాండ్‌మార్క్‌గా నిలిచేలా శుక్రవారం దుబాయ్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఐతే, సినిమాలో సాంగ్స్‌లేవని.. మూడుపాటలను రెహమాన్ రికార్డ్ చేస్తే.. ఒక్కటే ధీమ్ సాంగ్‌గా సినిమాలో వినియోగించారని తెలుస్తుంది.

ఇక మిగతా రెండు పాటలు లైవ్‌లో ప్రెజెంట్ చేస్తున్నట్టు రెహమాన్ చెప్పాడు. శంకర్ సినిమాల్లో మనకు తెలిసి… సాంగ్స్ ఆంటే ఎంతో కలర్‌ఫుల్‌గా సెట్స్, ఫారిన్ లొకేషన్స్ లో … అనుకుని ఓ రకంగా ఎక్స్ పెక్ట్ చేసి వస్తాం. కాని అవి లేవని తెలిసే సరికి అందరూ డిజప్పాయింట్ అయిపోయారు. సాంగ్స్ పెడితే…. మూవీ స్క్రీన్ ప్లే‌కు అడ్డొచ్చేలా ఉన్నాయని భావించిన శంకర్ ఈ విధంగా డిజైన్ చేశాడని అంటున్నారు …యూనిట్ సభ్యులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -