Saturday, May 25, 2024
- Advertisement -

బాబుకు రాజీనామా లేఖ‌ను ఇచ్చిన రేవంత్‌..

- Advertisement -

తెలంగాణా టీడీపీలో కొన్ని రోజుల‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు పుల్ స్టాప్ ప‌డింది. అంద‌రు అనుకున్న‌ట్లుగానె ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బాయ్ చెప్పేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.

ఇక రేవంత్ కాంగ్రెస్‌లోకి వెల్ల‌డానికి లైన్ క్లియ‌ర్ అయ్యింది. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని, అయితే టీడీపీతో పాటు అద్యక్షుడిపైనా తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో రేవంత్ కలుసుకున్నాడని వార్తలు వచ్చినప్పటి నుంచీ ప్రకంపనలు రేగాయి. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తోన్న రోజే ఈ విషయం బయటపడింది. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చేదాకా ఆగి అమరావతిలో చంద్రబాబును కలిసి రాజీనామా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -