Wednesday, May 8, 2024
- Advertisement -

వామ్మో.. మహేశ్ తో సినిమా తీయడం అంత కష్టమా..!

- Advertisement -

తాజాగా ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన పుకారు వినిపిస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి నిర్మాత చిన్నబాబు ప్రిన్స్ మహేశ్ బాబు నుంచి పది కోట్ల రూపాయలు వెనక్కు తీసుకున్నాడని అంటున్నారు. డేట్స్ కోసం అంటూ ఈ అడ్వాన్స్ ను ఇచ్చిన ఆ నిర్మాత మహేశ్ తో సినిమా వర్కవుట్ అయ్యేలా లేదనే భావనతో.. ఈ డబ్బును వెనక్కు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఎప్పుడో పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చిన ఆయన ఇప్పుడు అందులో పది కోట్ల రూపాయలు వెనక్కు ఇప్పించుకున్నాడట! 

ఎందుకలా అంటే.. ఇప్పుడప్పుడే మహేశ్ తో సినిమా సాధ్యం అయ్యేలా లేదని అర్థం చేసుకుని ఆయన ఈ పని చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇక్కడ తీసుకోవడం విశేషం కాదు కానీ.. మహేశ్ తో సినిమా కోసం మరీ ఇంత కష్టపడాలా.. కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఆయన డేట్స్ కోసం వెయిట్ చేయాలా..! అనే ఆశ్చర్యాలు కలుగుతున్నాయిప్పుడు. సినిమా ప్రారంభం అవుతుందో లేదో తెలియని దశలోనే ఇలా కోట్ల రూపాయల అడ్వాన్సులు ఇచ్చి.. వెయిట్ చేయడం అంటే.. సినిమా నిర్మాణం ఎంత కష్టమైన పనో… నిర్మాత పరిస్థితి ఏమిటో… సులభంగా అర్థం చేసుకోవచ్చేమో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -